మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’తో హిట్ కొట్టి 2022ని ముగించాడు. రొటీన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీసినప్పటికీ.. ప్రేక్షకులు దీనిని బాగానే ఆదరిస్తున్నట్లు కనిపిస్తుంది. రోజురోజుకి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఈ విషయం సులభంగా అర్ధమైపోతుంది. ఇక ఇందులో పాత రవితేజ కనిపించాడు. హీరోయిన్ శ్రీలీల అయితే ఈ సినిమాతో చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. కుర్రాళ్లయితే ఆమెని క్రష్ లిస్టులో యాడ్ చేసుకున్నారు. ఇక అందరూ కూడా శ్రీలీలని మెచ్చుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని రవితేజ ఎప్పుడో చెప్పడం విశేషం.
ఇక విషయానికొస్తే.. రవితేజ, తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేసి చాలా కాలమైపోయింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా.. అసలు గుర్తింపే లేని సైడ్ క్యారెక్టర్స్ లాంటివి చేస్తూ, హీరోగా ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగులో వచ్చిన అద్భుతమైన కామెడీ సినిమాల్లో రవితేజవి కచ్చితంగా ఉంటాయి. అందుకే కొత్త డైరెక్టర్స్, హీరోయిన్లని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. తాజాగా ‘ధమాకా’లో తనతో కలిసి శ్రీలీల గురించి చాలాసార్లు మెచ్చుకుంటూనే వచ్చాడు.
రవితేజ చెప్పినట్లే ‘ధమాకా’లో శ్రీలీల యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇక డ్యాన్సులైతే చెప్పాల్సిన పనిలేదు. జింతాత, దండకడియాలు సాంగ్స్ లో రవితేజని మైమరిపించేలా స్టెప్పులతో అదరగొట్టింది. ఇందులో శ్రీలీలని చూస్తుంటే.. రాబోయే రెండు మూడేళ్లలో ఈమె.. తెలుగులో స్టార్ గా ఎదగడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అమెరికాలో తెలుగు సంతతి కుటుంబంలో పుట్టిన శ్రీలీల.. బెంగళూరులో పెరిగింది. కానీ తెలుగులోనే అరడజనకు పైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తాజాగా ‘ధమాకా’ సక్సెస్ మీట్ జరగ్గా.. అందులోనూ శ్రీలీల చాలా హుషారుగా కనిపించింది. ఈ ఈవెంట్ లో కేక్ కట్ చేసిన సందర్భంగా.. రవితేజ, శ్రీలీల తలపై ముద్దుపెట్టాడు. అయితే ఇందులో చాలా ప్యూరిటీ కనిపిస్తుంది తప్ప వల్గారిటీ ఏ మాత్రం కనిపించడం లేదు. దీన్ని చూసిన రవితేజ-శ్రీలీల ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. హీరోలు.. యంగ్ హీరోయిన్స్ ని యాంకరేజ్ చేయడం అంటే ఇలా ఉండాలి అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.