సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ షో చేయడమనేది చాలా కామన్. అందులోనూ చిత్ర పరిశ్రమ అంటేనే అందరూ గ్లామర్ ప్రపంచమని అంటుంటారు. అలాంటప్పుడు ఈ గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగాలంటే హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను మాయ చేయకతప్పదు. కొన్నిసార్లు సినిమాలో అవసరాన్ని బట్టి, సన్నివేశం డిమాండ్ బట్టి అందాలను ఎరగా వేయాల్సి ఉంటుంది. కానీ.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి గ్లామర్ షో ఒక్కటే సరైన మార్గమని భావిస్తున్నారు ముద్దుగుమ్మలు.
ఈ జాబితాలో కన్నడ బ్యూటీ రష్మిక మందాన పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే.. కెరీర్ ప్రారంభంలో పక్కింటి అమ్మాయిలా డీసెంట్ రోల్స్, డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకున్న రష్మిక.. పుష్ప సినిమాతో అందాల షోలో ఓపెనప్ అయిపోయింది. సామి సామీ పాటలో రష్మిక గ్లామర్ ట్రీట్ ని చూడవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తో అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది.. కాబట్టి.. నేషనల్ మీడియాలో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటోంది కనుక అమ్మడికి అందాలను కెమెరా ముందు పెట్టడం తప్పడం లేదంట.
ఈ క్రమంలో బాలీవుడ్ లో సినిమాలు ఒప్పుకున్నాక రష్మిక ఏ స్థాయిలో అందాలను ఎరగా వేస్తోందో సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఇక తాజాగా బ్లూ టాప్ ధరించి రష్మిక చేసిన హాట్ ట్రీట్ మాములుగా లేదు. ఏకంగా టాప్ టు బాటమ్ బ్లూ జీన్స్ లో అమ్మడు అదిరిపోయే అందాల విందు చేసింది. దీంతో గ్లామర్ ప్రియులందరికీ రష్మిక కొత్త ఫోటోలు.. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే రష్మిక బన్నీ సరసన ‘పుష్ప 2’లో నటించబోతుంది. మరి రష్మిక లేటెస్ట్ గ్లామర్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.