సినీ ఇండస్ట్రీలో ‘మెగా’ ప్రస్థానం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ గా ఎవరెస్ట్ శిఖర స్థాయిని అందుకున్న చిరంజీవి నటవారసత్వాన్ని.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. దాదాపు 15 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ చరణ్.. ఒక మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. అయితే.. సినీ ఇండస్ట్రీకి ఇన్నేళ్ళుగా తనవంతు కాంట్రిబ్యూషన్ చేస్తున్న చరణ్ తాజాగా ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నాడు.
ప్రస్తుతం చరణ్ కి ‘ట్రూ లెజెండ్’ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఎన్డిటివి(NDTV) నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్నాడు చరణ్. ఈ క్రమంలో ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న అనంతరం స్టేజ్ పై ఎమోషనల్ అయిపోయాడు. తాను తీసుకున్న ట్రూ లెజెండ్ అవార్డు కూడా తండ్రి చిరంజీవికి అంకితం చేస్తూ.. చిరంజీవి బ్లడ్ బ్యాంకుని స్థాపించడం వెనుక అసలు కారణాన్ని షేర్ చేసుకున్నాడు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “1997లో మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఒకరు.. సకాలంలో బ్లడ్ అందకపోవడం వల్ల చనిపోయారు. మేమంతా షాకయ్యాం.. 20 శతాబ్దంలో కూడా బ్లడ్ లేక మనిషి చనిపోవడమా? అనే విషయం మమ్మల్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మా ఫాదర్ చిరంజీవి బ్లడ్ బ్యాంకును స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఆయనను స్టార్ ని చేసిన అశేష అభిమానుల సహకారంతో 1998లో ‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు’ ప్రారంభించారు. దీనికోసం ఫ్యాన్స్ ఎవరైనా తనతో ఫోటో తీసుకోవాలని అనుకుంటే.. సొసైటీ కోసం ఓ బ్లడ్ డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పటినుండి ఓ యూనిట్ బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి అభిమానితో ఆయన ఫోటో దిగేవారు” అని చరణ్ ఎమోషనల్ గా చెప్పారు.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియా వేదికగా తనయుడు చరణ్ ని అభినందించారు. అలాగే చరణ్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని.. మున్ముందు ఇలాంటివి మరెన్నో అచీవ్ చేయాలనీ ఆయన ఆకాంక్షించారు. ఇక చరణ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘RC15’ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. మరి రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.