రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు గాను ఆయనకు ఆహ్వానం అందింది. సినీ పరిశ్రమ నుంచి కేవలం రామ్‌చరణ్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కింది.
“రామ్ చరణ్”.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరు ఒక ట్రెండింగ్ గా మారింది. చిరంజీవి వారసుడిగా సినిమాలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగిన తీరు అద్భుతం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చరణ్.. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని కూడా సంపాదించుకున్నాడు. దీంతో ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్న రామ్ చరణ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. ఇదిలా ఉండగా.. తాజాగా జీ-20 సమ్మిట్ చరణ్ కి అరుదైన గౌరవం కలిపించింది.
G20 సమ్మిట్ టూరిజం వర్కింగ్ గ్రూపు మీటింగ్‌కి సీనీ ఇండస్ట్రీ తరపున ప్రతినిధిగా పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో శ్రీ నగర్లో జరుగుతున్న G20 సమ్మిట్-టూరిజం వర్కింగ్ గ్రూపు మీటింగ్‌కు భారత సినీ పరిశ్రమ తరపు నుంచి ఆయన ప్రతినిధిగా హాజరు కావటానికి బయలుదేరాడు. ఇప్పుడు ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలో సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రాంతాల్లో మన దేశం యెుక్క సామర్థ్యం గురించి గొప్పగా చెప్పబోతున్నాడు.
మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ క్రమంలోని భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇది చలన చిత్ర నిర్మాణానకి అనువైన ప్రదేశంగా ఎలా మారింది అనే విషయాలను చరణ్ బలంగా చెప్పబోతున్నాడ. G20 లోని సభ్య దేశాలు మన దేశంలో చురుకైనా భాగస్వామ్యం వహిస్తున్నారని చరణ్ తెలియజేసాడు. మరి, జీ-20 సమ్మిట్ చరణ్‌కు అరుదైన గౌరవం కల్పించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wow ! What a way to start the first session of 3rd Working Grp of Tourism. #RRRMovie. @AlwaysRamCharan. #NaatuNaatu. Dance Off! HC Wong@g20org @JandKTourism @srinagaradmin #G20Kashmir #RamCharan pic.twitter.com/NtAOVvw2AL
— Singapore in India (@SGinIndia) May 22, 2023