టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైన సంగతి విదితమే. తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నట్లు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఈ జంట శుభవార్త చెప్పింది.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైన సంగతి విదితమే. పెళ్లై 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. 2012 లో వీరిద్దరికి పెళ్లి జరగగా .. గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట శుభవార్త చెప్పింది. ఈ నెల 20 వ తేదీ తెల్లవారు జామున ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నరని అపోలో వైద్యులు ప్రకటించారు. బుల్లి ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లివిరిశాయి. వరుసగా మెగా, అల్లు కుటుంబాల నుండి అపోలో ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ కూడా సందడి నెలకొంది. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే తమకు ఇష్టమైన రోజైన మంగళవారం నాడు పాప పుట్టినందుకు అమితమైన ఆనందంలో ఉన్నట్లు చెప్పారు.
కాగా, ఈ రోజున ఆసుపత్రి నుండి ఉపాసన, బేబీ డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు. ‘పాప, ఈ నెల 20న ఉదయం పుట్టింది. ఉపాసన, పాప రికవరీ అయ్యి ఇవాళ ఇంటికి వెళుతున్నాం. ఈ సందర్భంగా డాక్టర్స్, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు. వారు బాగా చూసుకున్నారు. పాప, ఉపాసన చాలా బాగున్నారు. మా అభిమానుల ప్రార్థనలు, పూజల వల్లే ఇదంతా. నేను మర్చిపోలేను. అభిమానుల నుండి ఇంతకన్నా నేనేమీ కోరగలను. అన్ని దేశాల నుండి ఆశీస్సులు వచ్చాయి, అవి ఎప్పుడూ అలానే ఉంటాయి. ఈ ఆనందంలో తాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీ ఆశీస్సులు మా పాకు ఉండాలని కోరుకుంటున్నాను’అని తెలిపారు. పాప పుట్టిన 21వ రోజు తేదీన పేరు పెడతామని, ఆ రోజు మీడియాకు తెలస్తుందని అన్నారు. ‘పాప పేరును ఉపాసన, నేను ఒకటి అనుకున్నామని, అనుకున్న సమయంలో మాకు పాపను ప్రసాదించాడని’ అన్నారు. పాప కచ్చితంగా నాన్నలానే ఉందని ఎమోషనల్ అయ్యారు.