టాలీవుడ్ లీడింగ్ యంగ్ హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. తండ్రికి తగ్గ తనయుడు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అంటూ ఇప్పటికే చాలా మందే బిరుదులు ఇవ్వడం చూశాం. ఇటీవలే ట్రిపులార్ సినిమాతో అతని నటనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలు రావడం చూశాం. జపాన్‌లో కూడా ట్రిపులార్ సినిమాని రిలీజ్ చేశారు. అక్కడ కూడా సినిమాకి, రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్‌లకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటన విషయంలో, ప్రవర్తన విషయంలో మెగాస్టార్ ఎన్నోసార్లు చెప్పుకుని మురిసిపోయారు. ఇండస్ట్రీలో కూడా చాలామంది రామ్ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శంకర్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయంతెలిసిందే. అది రామ్ చరణ్ కెరీర్‌లో 15వ చిత్రం కావడం కూడా విశేషం. ఇప్పటికే RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే శంకర్ అటు కమల్ హాసన్‌తో ఇండియన్-2, ఇటు రామ్ చరణ్‌తో ఆర్సీ15 సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ డేట్ కూడా కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే సినిమా నుంచి కనీసం అప్‌డేట్స్ కూడా రావడం లేదంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అయిన విషయం తెలిసిందే. అధికారికంగా మాత్రం అప్‌డేట్స్ రావడం లేదు.
“Yeh dosti…hum nahi todenge,” @akshaykumar and @AlwaysRamCharan‘s bromance at the #HTLS2022 stage.
Watch LIVE here: https://t.co/lZbcyiJgyv pic.twitter.com/bbmpFo38xw
— Hindustan Times (@htTweets) November 12, 2022
శనివారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి రామ్ చరణ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ అక్షయ్‌తో కలిసి చెర్రీ స్టెప్పులేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్షయ్‌కి టాలీవుడ్ సాంగ్స్ కు స్టెప్పులు కూడా నేర్పించాడు. అక్షయ్‌తో కలిసి బాలీవుడ్ క్లాసిక్ హిట్ సాంగ్స్‌కు రామ్ చరణ్ డాన్స్ చేశాడు. అక్కడ చెర్రీని ఆర్సీ15పై ప్రశ్నించారు. డైరెక్టర్ శంకర్ సినిమా నుంచి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. అందుకు చెర్రీ.. “శంకర్ గారిని నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. 1992 నుంచి నేను డైరెక్టర్ శంకర్ అభిమానిని. ఆయనతో సినిమా చేయడం అనేది నా డ్రీమ్. ఈ సినిమా ఆ డ్రీమ్ నెరవేరుతోంది. అప్‌డేట్స్ విషయాలు మాత్రం ఆయనకే తెలియాలి. నేను కూడా అందరిలాగానే ఎదురుచూస్తున్నాను. రెండ్రోజుల్లో ఓ సాంగ్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్తున్నాం. ఆ విషయం మాత్రం చెప్పగలను” అంటూ రామ్ చరణ్ సమాధానమిచ్చాడు.
#HTLS2022 | @AlwaysRamCharan teaches @akshaykumar some steps from the South!
Check it out here: https://t.co/lZbcyiJgyv pic.twitter.com/SoRdsUmMD9
— Hindustan Times (@htTweets) November 12, 2022
#HTLS2022 | @AlwaysRamCharan talks about his next venture with iconic filmmaker Shankar
WATCH LIVEhttps://t.co/lZbcyiJgyv pic.twitter.com/SVifkR5OQg
— Hindustan Times (@htTweets) November 12, 2022