తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. అలాంటి వారిలో అతి కొద్ది మందే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మగధీర చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ నటించిన చిత్రాలు తక్కువే అయినా.. అందులో చాలా వరకు సూపర్ హిట్ చిత్రాలే. టాలీవుడ్, బాలీవుడ్ లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీతో ఏకంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి ఎంతో ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతా రామ రాజుగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో గొప్ప బ్యాగ్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్, డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నారు. ఈ మద్య కాలంలో రామ్ చరణ్ తన ఇన్ స్ట్రాలో బాగా యాక్టివ్ అయ్యారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెకేషన్ టూర్స్, మూవీ అప్ డేట్స్ తో అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరుకుంది. అది కూడా అతి తక్కువ సమయంలో ఈ రికార్డు క్రియేట్ చేశాడు రామ్ చరణ్.
స్టార్ హీరోలకు 12 మిలియన్స్ ఫాలోవర్లు అంటే సామాన్య విషయం కాదు.. సౌత్ లో ప్రస్తుతం ఈ నెంబర్ దాటిన హీరోలు ఇద్దరే ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి 19.9 మిలియన్స్ ఉంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి 17.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 12 మిలియన్స్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ మూడో స్థానంలోకి చేరారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో మరో మూవీ కమిట్ అయినట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.