సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు చేతిలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ఉంటే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. గ్లామర్ ని షో చేసేందుకు సౌత్ సినిమాలలో అవకాశం దొరక్కపోవచ్చు. అదే సోషల్ మీడియాలో అయితే ఇష్టం వచ్చినట్లుగా అందాలను పోస్టుల రూపంలో ప్రెజెంట్ చేయవచ్చని భావిస్తున్నారు. పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటినుండో తెలుగు సినిమాలలో గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
ఈ మధ్య రకుల్ తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటోంది. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టినట్లు తెలుస్తుంది. సినిమాలు ఆడినా ఆడకపోయినా రకుల్ కి బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అందుకే అక్కడి ట్రెండ్ కి తగ్గట్లుగా స్కిన్ షో, లిప్ లాక్స్, బెడ్ సీన్స్ చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోషూట్స్, బికినీ వీడియోలతో రకుల్ ఫ్యాన్స్ లో వేడి పుట్టిస్తోంది.
ఎలాగో ఈ భామ మోడలింగ్ నుండి సినిమాల్లోకి వచ్చింది. కాబట్టి ఖాళీ దొరికితే కొత్త కొత్త ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన బికినీ పిక్ తెగవైరల్ అవుతోంది. మాల్దీవ్ సముద్రతీరంలో బ్లూ బికినీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. రకుల్ కి బికినీ వేయడం కొత్తకాదు కానీ.. బికినీ వేసిన ప్రతిసారీ అమ్మడు రెట్టింపు అందంతో నెటిజన్లను కవ్విస్తోంది. లేటెస్ట్ ఫోటోలో రకుల్ టాప్ టు బాటమ్ నాజూకు అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మరి రకుల్ బికినీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.