ఈ నేపథ్యంలోనే మరణానికి ముందు ఆయన తీసుకున్న చివరి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పలు విషయాలను ఆయన వెల్లడించారు.
ప్రముఖ తెలుగు చలన చిత్ర నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ జూన్ 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన రక్త విరేచనాలు, వాంతుల బారినపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన ఆరోగ్యం చికిత్సతో మెరుగుపడలేదు. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతూ 18వ తేదీ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు మరుసటి రోజు బోరబండలోని శ్మశాన వాటికలో జరగాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. రాకేష్ మాస్టర్ శిష్యులైన శేఖర్, జానీలు కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఆయన చనిపోయి దాదాపు వారం రోజులు పైనే అవుతోంది. ఇక, ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరణానికి ముందు ఆయన తీసుకున్న చివరి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడటానికి ఓపిక కూడా లేని స్థితిలో ఉన్నారు. ఒక విషయానికి.. మరో విషయానికి పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు తొమ్మిది నిమిషాల పాటు ఆ వీడియోను చిత్రీకరించారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అక్కడ ఎండలు బాగా ఉన్నాయని అన్నారు.
గత కొన్ని రోజులుగా కేవలం మంచి నీళ్లు తాగుతున్నట్లు వెల్లడించారు. తాను మందులో లేనని, నీరసంలో ఉన్నానని ఆయన తెలిపారు. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యల మీద కూడా కామెంట్లు చేశారు. వైజాగ్ సత్య చాలా కన్నింగ్‌గా ప్రవర్తిస్తున్నాడని.. అతడి పని చెబుతానని అన్నారు. వీడియో చివరల్లో ఓ మహిళకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.