సూపర్ స్టార్ రజనీకాంత్.. అంతకంటే సూపర్ డైరెక్టర్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?
ఇండస్ట్రీలో రీసెంట్ టైంలో బాగా ట్రెండ్ అయిన పదం సినిమాటిక్ యూనివర్స్. గతంలో హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఇది కాస్త.. ఇప్పుడు మన సినిమాల వరకు వచ్చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అని.. డైరెక్టర్స్ ఎవరికీ వారు క్రియేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లోనూ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అని ఉంది. తాజాగా అందులో భాగంగా ‘వార్ 2’లో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తాడనే న్యూస్ తెగ వైరల్ అయింది. ఇప్పుడు LCUలో ఏకంగా సూపర్ స్టార్ రాబోతున్నారనే న్యూస్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తోంది. అందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ కూడా చాలానే వినిపిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ‘ఖైదీ’తో ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశాడు. ఈ సినిమాని ‘విక్రమ్’తో లింక్ చేయడం చూసి ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ప్రస్తుతం విజయ్ తో తీస్తున్న ‘లియో’ కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటుందని న్యూస్ వస్తుంది. బయటకు మాత్రం ఎక్కడా దీన్ని రివీల్ చేయట్లేదు. ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తి, సూర్య, విజయ్ సేతుపతి, కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్.. చెప్పుకుంటూపోతే స్టార్స్ అందరూ వచ్చి చేరుతున్నారు. ఇప్పుడు ఈ యూనివర్స్ లోకి రజనీకాంత్ కూడా జాయిన్ కాబోతున్నారట.
రీసెంట్ గా కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ‘లియో’ టీమ్.. వచ్చే నెల నుంచి చెన్నైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనుంది. ఈ క్రమంలోనే టైం దొరికేసరికి రజనీకాంత్ కు డైరెక్టర్ లోకేష్ ఓ స్టోరీ చెప్పాడట. దీంతో ఈ కాంబో సెట్ అయిపోయిందని అంటున్నారు. ‘తలైవా 171’ వర్కింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతలో ‘జైలర్’తో పాటు జ్ఞానవేల్ సినిమాని తలైవా పూర్తి చేస్తారు. ఇప్పటికే లోకేష్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కు ఫిదా అయిన ప్రేక్షకులు.. రజనీకాంత్ తో సినిమా అనేసరికి అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ గ్యారంటీ! మరి LCUలోకి సూపర్ స్టార్ అంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#LokeshKanagaraj Lineups🔥🔥
– #Leo
– #Thalaivar171(Talks)
– #Kaithi2
– #Vikram3
– #Rolex standalone (Talks)
Next 5 Years ku Idhu pothum🫰💥 pic.twitter.com/MwzuS4gSZL— AmuthaBharathi (@CinemaWithAB) April 5, 2023