Indiana Jones: ప్యాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ హీరో రాజమౌళి మార్క్ డైరెక్షన్, యాక్షన్‌లో ప్యాన్ వరల్డ్ హీరో అయిపోవటం పక్కా అని భావిస్తున్నారు. ఇక, రాజమౌళి-మహేష్‌ల సినిమా ఎలా ఉండబోతోందన్న దానిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి-మహేష్‌ల సినిమా ప్రముఖ హాలీవుడ్ చిత్ర సిరీస్ ‘ఇండియానా జోన్స్’ మాదిరిగా తెరకెక్కబోతోందని చెప్పారు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తీయనున్నామన్నారు. సినిమా మొత్తం అడవుల్లో ఉండే అవకాశం ఉందన్నారు. కథకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ తయారు చేయలేదని, ఓ లైన్ అనుకున్నామని వెల్లడించారు. కాగా, ఇండియానా జోన్స్ సినిమాల సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది.
అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. దాదాపు 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 1981లో ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ మొదటి సినిమా రాగా.. 2023లో ఐదవ సినిమా రాబోతోంది. మరి, ప్యాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో త్వరలో రాబోతున్న సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sivakarthikeyan: వీడియో: కొరియన్ నటులపై వ్యాఖ్యలు.. వివాదంలో స్టార్ హీరో శివకార్తికేయన్