Radhe Shyam: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘ర్యాథే శ్యామ్’ సినిమా భారీ అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు భారీ హిట్టయ్యాయి. రాథేశ్యామ్‌లోని తెలుగు వర్షన్ పాటలకు జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించగా.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే, తమన్ ఇచ్చిన ఓ థీమ్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ‘సోల్ ఆఫ్ రాథేశ్యామ్’ థీమ్‌ను ఏఆర్ రెహ్‌మాన్ ‘జెరియా’ ఆల్బమ్‌నుంచి తమన్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
కాగా, సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత సినిమాల్లోని తప్పుల్ని వెతికి మరీ బయటపెట్టడం ఎక్కువైంది. ఈ సినిమాను ఆ సినిమా నుంచి కాపీ చేసి తీశారు.. ఈ పాటను ఈ పాటనుంచి కాపీ చేసి రాశారు. మ్యూజిక్ పలానా సినిమాను పోలినట్లు ఉంది.. అంటూ జనం కాపీ క్యాట్లను బయటకు తీసుకు వస్తున్నారు. సినిమా రంగంలో మ్యూజిక్‌కు సంబంధించి కాపీ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. తమన్ విషయానికి వస్తే.. ఈయన ఇచ్చిన మ్యూజిక్ కాపీ అంటూ చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. తమన్ ఓ కాపీ క్యాట్ అన్న ప్రచారం కూడా నడుస్తోంది.
ఇవి కూడా చదవండి : F3లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా..: దిల్ రాజు