ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం పుష్ప. క్రేజీ ప్రాజెక్ట్‌గా భావించి డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఇక మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బన్నీ సరసన నటిస్తోంది హీరోయిన్ రష్మికా మందన్నా. ఇక సినిమా దర్శక, నిర్మాతలు పుష్ప టీజర్స్, సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మూవీపై అంచనాలు మరింత పెంచుతున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్‌ను సైతం రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇటీవల విడుదల చేసిన దాక్కో దాక్కో మేక అనే సాంగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా..ఈ మూవీకి మాత్రం లీకుల బెడద తప్పటం లేదంటూ బన్నీ ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఇప్పటికే పుష్ప నుంచి 47 నిమిషాలతో కూడిన సీన్స్ తో పాటు తాజాగా ఓ ఫైట్ సీన్ కూడా లీకైంది. దీంతో ఈ లీకులపై దర్శక, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. వరుసగా లీకుల వ్యవహారం పెరుగుతుండటంతో మైత్రీ మూవీస్ సంస్థ చేతిలెత్తేసినట్లు కనిపిస్తోంది.
ఇక సినిమా షూటింగ్ సమయంలోనే ఇన్ని లీకులు జరిగితే షూటింగ్ పూర్తయ్యే సరికి పరిస్థితి చేయిదాటి పోతుందేమోనని బన్నీ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన మైత్రీ మూవీస్ లీకులు ఎవరు చేస్తున్నారనే దానిపై విచారణ మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకనైన జాగ్రత్త పడకుంటే పుష్ప నుంచి మరిన్ని సీన్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు.