ప్రముఖ హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ఇందుకు సంబంధించిన న్యూస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..
కోలీవుడ్‌లో సినిమా కెరీర్‌ను ప్రారంభించి హాలీవుడ్‌లో పాతుకు పోయారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. అక్కడ వరుస సినిమాలు.. వెబ్ సిరీస్ చేస్తూ బిజీ బిజీ అయిపోయారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘లవ్ ఎగైన్’ అనే ఇంగ్లీష్ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే ఓ ఆంగ్ల సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బిడ్డ కోసం ఆమె సినిమాలు మానేయనున్నారట.
ప్రసుత్తం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులో సినిమాలు చేయటం కంటే.. ఒక్కగానొక్క కూతురు మాలతీ మేరీ చోప్రా జోనస్‌ను చూసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. కూతురు వయసు పెరిగే కొద్ది తన అవసరం చాలా ఉంటుందని ఆమె భావిస్తున్నారట. అందుకే త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో కూతుర్ని పెంచుకోవటానికి సిద్దమవుతున్నారట. ఓ సారి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా కూతురి కోసం సినిమాలు మానుకోవాల్సి వస్తే.. నేను రెండో ఆలోచన లేకుండా సినిమాలు మానుకుంటాను. వేరే దేశంలో స్థిరపడతాను’’ అని స్పష్టం చేశారు.
కాగా, ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో పడ్డారు. 2018లో ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్యా పదేళ్ల గ్యాప్ ఉన్నా.. వీరి ప్రేమకు, పెళ్లికి అది అడ్డంకి కాలేదు. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక సినిమాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. మరి, ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్‌బై చెప్తున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.