పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ మార్చి 11న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ కాస్త ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రాధే శ్యామ్ మలయాళ వెర్షన్ ప్రచారంలో భాగంగా ప్రభాస్.. ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.
రాధేశ్యామ్ తో పాటు ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలకు సంబంధించి మేకర్స్ అప్ డేట్స్ ఇస్తున్నారు. కానీ ప్రభాస్ ఇచ్చిన అప్ డేట్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తుండటంతో సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి.ఇక ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభాస్.. మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇండైరెక్ట్ గా బయటపెట్టాడని తెలుస్తుంది. ఎందుకంటే.. రాధేశ్యామ్ మలయాళం వెర్షన్ కి పృథ్వీరాజ్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ క్రమంలో అతనికి థాంక్స్ చెబుతూ.. పృథ్వీరాజ్ సార్ తో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ హింట్ తో సినీవర్గాలలో సలార్ అప్ డేట్ ఇచ్చేసాడనే వార్త ట్రెండ్ అవుతోంది.
మరి ప్రభాస్ కటౌట్ కి తగ్గ నటులు కావాలంటే.. మినిమమ్ పృథ్వీరాజ్ పర్సనాలిటీ అవసరం అవుతుందని అంటున్నారు. సలార్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఇచ్చిన అప్డేట్ కి సలార్ పై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న పృథ్వీరాజ్.. సలార్ లోకి రావడం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రభాస్ – పృథ్వీరాజ్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.