సినిమా ప్రపంచంలో హీరోయిన్ లు ముందుకు సాగాలి అంటే.. కేవలం నటన ఒక్కటే సరిపోదు. నటనతో పాటుగా అందాల ఆరబోత కూడా ఇక్కడ ఓ క్వాలిఫికేషన్. ఈ విషయం తెలుసుకున్న ఓ స్టార్ హీరోయిన్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఎన్నడు చూడని విధంగా రొమాంటిక్ సీన్ లో రెచ్చిపోయింది.
సినిమా ప్రపంచంలో హీరోయిన్ లు ముందుకు సాగాలి అంటే.. కేవలం నటన ఒక్కటే సరిపోదు. నటనతో పాటుగా అందాల ఆరబోత కూడా ఇక్కడ ఓ క్వాలిఫికేషన్. ఈ సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ క్వాలిఫికేషన్ ను తొందరగా ఒంటబట్టించుకున్న కొందరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో దూసుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు ఎంత గ్లామర్ షో చేసినా అవకాశాలు దక్కించుకోలేకపోవడం కూడా చూశాం. మరికొందరు మాత్రం అద్భతమైన నటనతో పాటుగా ఎక్స్ పోజింగ్ చేస్తు.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అమలాపాల్ ఒకరు. సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు షేర్ చేస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టించే అమలాపాల్.. తాజాగా రిలీజ్ అయిన ‘ఆడుజీవితం’ సినిమాలో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ తో బోల్డ్ గా నటించి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
పృథ్వీరాజ్ సుకుమారన్-అమలాపాల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆడుజీవితం’. మలయాళ మూవీ అయిన ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పొట్ట కూటి కోసం సౌదీ వెళ్లిన వలస కూలీ అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడో వివరించేదే ఈ ఆడుజీవితం సినిమా. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని, ట్రై చేయని కోణంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ అయిన బ్లెస్సీ దర్శకత్వం వహించడంతో.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అదీకాక ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ జోడీ ఏఆర్ రెహమాన్-రసూల్ పుకుట్టీలు ఈ సినిమాకు వర్క్ చేయడంతో.. మరోసారి ఇండియన్ సినిమాకు ఆస్కార్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు సినీ పండితులు. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ కు జోడీగా నటించింది అమలాపాల్. ఇప్పటికే బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అమలాపాల్.. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో మరింత బోల్డ్ గా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ తో కలిసి లిప్ లాక్ తో పాటుగా రొమాంటిక్ సీన్లలో నటించినట్లు తెలుస్తోంది. నటనలో తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అమలాపాల్.
అయితే కథ డిమాండ్ చేస్తే.. ఎలాంటి సీన్స్ లో నైనా చేయడానికి రడీ అవుతున్నారు కొందరు హీరోయిన్ లు. అందులో ముందు వరుసలో ఉంటారు అమలాపాల్. తాజాగా మరోసారి తనలో ఉన్న బోల్డ్ నెస్ ను, నటనను ఈ సినిమాలో చూపించినట్లు సమాచారం. ఇక ఆడుజీవితం ట్రైలర్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన ట్రైలర్ గా నిలిచింది. ఇక ఆడుజీవితం సినిమాలో అందరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉండటంతో పాటు ట్రైలర్ ని చూస్తే.. ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డ్స్ రావడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.