కరోనా మహమ్మారి విజృంభించిన ప్రతిసారి OTT ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరుగుతోంది. అందుకే పెద్ద చిన్నా సినిమాలనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యకాలంలో థియేటర్ల కంటే ఓటిటిల్లోనే ప్రేక్షకులు ఎక్కువ సినిమాలు చూస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ నాలుగు లేదా ఆరు వారాలకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
ఇటీవల అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి ఓటిటిలన్ని సినిమాలను కొనేందుకు పోటీ పడుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాల విషయంలో ఓటిటిల మధ్య కూడా కొన్ని సంఘటనలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మధ్య జరిగిన ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం జనాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ లో పుష్ప సినిమాని చూస్తుండటంతో.. ట్విట్టర్ లో నెట్ ఫ్లిక్స్(NETFLIX) ని ట్యాగ్ చేస్తూ.. ‘మీ యాప్ లో ప్రేక్షకులు ఇప్పుడేం చూడట్లేదు. మా దగ్గర పుష్ప చూస్తూ అంతా బిజీగా ఉన్నారు’ అని ప్రైమ్ ట్వీట్ చేసింది.
వెంటనే ప్రైమ్ ట్వీట్ కి స్పందించిన నెట్ ఫ్లిక్స్.. ‘మరి మేము ఆ అందరిలో ఉన్నామా? ఊ అనం.. ఊ ఊ కూడా అనం’ అంటూ పుష్ప స్టైల్ లో రీట్వీట్ చేస్తూ బదులిచ్చింది. చూడటానికి ఇది ట్విట్టర్ వార్ లాగే అనిపించినా ఫన్నీగా ఉందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ ట్విట్టర్ వార్ చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ట్విట్టర్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Are we “everyone”?
Ooh anam. Kaani oohoo kooda anam 👀 https://t.co/jWwH6Y8nmw— Netflix India (@NetflixIndia) January 8, 2022