ప్రణీత శుభాష్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసింది. సినిమాల్లో ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో 2021 మే నెలలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అభిమానులకు బాగా అందుబాటులో ఉంటోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ జీవితంలో ఏం జరిగినా కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రణీత కూడా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ సీజన్ 6.. ఆ 18 కంటెస్టెంట్స్ వీళ్లే!
తాను తల్లి కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హెచ్‌సీజీ హోమ్ టెస్టింగ్ రిజల్ట్ తోపాటు, స్కానింగ్ కాపీని కూడా చూపిస్తూ తన భర్తను హత్తుకుని ఉన్న ఫొటోస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే తన భర్త బర్త్ డే కూడా కావడం మరో విశేషం. అదే రోజు తన భర్తకు ఈ శుభవార్త చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె పోస్ట్ చేసింది. మరి ప్రణీతకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.