ప్రభాస్ మంచితనం, గొప్ప మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, మరోసారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. ఒక్కోరి ఖాతాలోకి పది వేల రూపాయలు జమ చేశారు.
చిత్ర పరిశ్రమలో మంచి మనసున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. తన అవసరం ఉన్నపుడు ప్రభాస్ తప్పక సాయం చేస్తుంటారు. ముఖ్యంగా పెదనాన్న నుంచి నేర్చుకున్న మంచి పనుల్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. సినిమా సభ్యులకు కానుకలు ఇవ్వటం, కడుపునిండా భోజనం పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. గతంలో చాలా సార్లు ఆయన తన చిత్ర బృందానికి కానుకలు ఇచ్చారు. రాథేశ్యామ్ సినిమా షూటింగ్ ముగింపు సయమంలో చిత్ర బృందానికి రాడో కంపెనీ వాచీలు కానుకగా ఇచ్చారు. ఒక్కో వాచీ ధర పది వేలకు పైనే ఉంది.
అలా పదుల సంఖ్యలో సినిమా టీం సభ్యులకు రాడో వాచీలను కానుకలుగా ఇచ్చారు. ఇప్పుడు మరో సారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. సలార్ చిత్ర బృందానికి మంచి కానుక ఇచ్చారంట. ఇంతకీ సంగతేంటంటే.. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ చిత్ర బృందం కోసం ఓ గొప్ప పని చేశారట.
సలార్ చిత్రం కోసం పని చేస్తున్న టీం సభ్యులందరి ఖాతాల్లోకి 10 వేల రూపాయల చొప్పున జమ చేశారంట. ఈ మేరకు ఫిల్మ్ సర్కిల్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరో మంచి తనానికి తెగ ఖుషీ అయిపోతున్నారు. తమ హీరో నిజమైన హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, సలార్ సినిమా టీం సభ్యులందరి ఖాతాల్లోకి ప్రభాస్ 10 వేల రూపాయల చొప్పున జమ చేశాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.