టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాన్మరణం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆయన అభిమానులను సైతం బాధించిన విషయం తెలిసిందే. 82 ఏళ్ళ వయసులో కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 11న కన్నుమూశారు. రెబల్ స్టార్ ఇక లేరనే వార్తను ఆయన ఫ్యామిలీతో పాటు యావత్ చిత్రసీమ జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యామిలీతో పాటు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను ఘనంగా నిర్వహించింది.
ఇక కృష్ణంరాజు మరణించి రెండు వారాలు గడుస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులు శ్యామల దేవి, ప్రభాస్, కుమార్తెలు ఆ బాధలో నుండి బయటికి రాలేకపోతున్నారు. ఇటీవలే కృష్ణంరాజు కుటుంబసభ్యులు పదకొండవ రోజున జరిపించాల్సిన కార్యక్రమాలు పూర్తిచేశారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి విదితమే. అదీగాక రెండు రోజుల క్రితమే ప్రభాస్ తన సలార్ సినిమా షూటింగ్ లో హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్న వీడియోస్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల మూవీస్ క్లిప్స్ ఎడిట్ చేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోస్ షేర్ చేస్తున్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ ఒకే రకమైన యాక్షన్ సీన్స్ ని ఎడిట్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. అదే వీడియోను ప్రభాస్ పెదనాన్న జ్ఞాపకంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసినట్లయితే.. అచ్చంగా రెబల్ స్టార్స్ ఇద్దరికీ ఇది మెమొరబుల్ వీడియో అని అర్థమవుతుంది. మరి ప్రభాస్ షేర్ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.