తెలుగు హీరోలకు కోట్లాది మంది అభిమానులుంటారు. సినిమాల్లో పాత్రలబట్టి సదరు హీరోలని ప్రేమించే వాళ్లు కొందరైతే… బయట కూడా ఆ వ్యక్తిని ఇష్టపడే వాళ్లు చాలామంది. ఏ హీరోని తీసుకున్నాసరే ఈ విషయంలో అస్సలు పోలిక పెట్టలేం. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ అలానే జరిగింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ చాలామంది డార్లింగ్ హీరోని తెగ మెచ్చుకుంటున్నారు. అందుకే కదా నిన్ను అందరూ ఇష్టపడేది అని మాట్లాడుకుంటున్నారు.
Stay Strong #Prabhas anna 🙏#KrishanamRaju 🙏 pic.twitter.com/iYEDMlhx1x
— SALAAR 🔥🤙💥 (@SunnyOfficial_4) September 12, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా మారాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ‘బాహుబలి’ రెండు చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించారు. దీంతో ప్రభాస్ ని ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. డార్లింగ్ ఏడుస్తున్న కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలు చూసిన చాలామంది అభిమానులు.. ‘ధైర్యంగా ఉండు అన్న, నీకు అండగా మేమున్నాం’ అని ఆ వీడియోల దిగువన కామెంట్స్ పెట్టారు. ఇక సోమవారం మధ్యాహ్నం.. కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. దీనికి ప్రభాస్ కుటుంబ సభ్యులు, సినీ నటులతో పాటు ఫ్యాన్స్ కూడా చాలామంది వచ్చారు. ఓవైపు పెదనాన్న చనిపోయారనే బాధలో ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ గురించి ప్రభాస్ అస్సలు మర్చిపోలేదు. ‘మర్చిపోకుండా భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్’ అని చెప్పాడట. ఈ విషయాన్ని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందుకే కదా ప్రభాస్ ని డార్లింగ్ అనేది అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ప్రభాస్.. అంత బాధలో ఉన్నాసరే ఫ్యాన్స్ ఆకలి తీర్చడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కృష్ణంరాజు పార్థివదేహంపై వెక్కివెక్కి ఏడ్చిన శ్యామలా దేవి!