Krishnam Raju: తెలుగు వెండి తెర రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. అంత్యక్రియల కోసం ఫామ్ హౌస్‌కు చేరుకున్న జనం అశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఇక, కృష్ణంరాజు మరణం భార్య శ్యామలా దేవికి ఎవ్వరూ ఊహించలేని లోటని చెప్పొచ్చు. కృష్ణంరాజు, శ్యామలా దేవికి కేవలం భర్త అని మాత్రమే చెప్పటం.. వారిద్దరి బంధాన్ని కించపరచటమే అవుతుంది. ఎందుకంటే.. వారిద్దరి మధ్యా భార్యాభర్తల బంధాన్ని మించిన అనుబంధం ఉంది. ఇద్దరూ ఆత్మబంధువులు, మంచి స్నేహితులు, గురు శిష్యులు.. కృష్ణంరాజుకు భార్య సర్వం అయితే.. శ్యామలా దేవికి భర్తే సర్వం. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లేవారిద్దరూ.
ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఒంటరిగా ఉన్న క్షణాలు కూడా చాలా తక్కువ. అలాంటిది భర్త తనను ఒంటరిగా వదిలేసి సుధూర తీరాలకు తరలిపోతుంటే.. శ్యామలా దేవి గుండె పగిలినంత పనైంది. ఆయన ఇకలేరు అన్న ఊహను భరించలేని స్థితిలో కన్నీళ్లు కట్టలు తెచ్చుకున్నాయి. కొన్ని గంటల తర్వాత కన్నీళ్లు ఇంకిపోయాయి. కన్నీళ్లకు మించిన ఓ వ్యధ మొదలైంది. భర్తను తలుచుకుని పదే పదే కుమిలిపోయింది. ఎంత మంది జనం ఓదార్చినా శ్యామలా దేవి దుఃఖం ఆగలేదు. భర్త భౌతిక దేహంపై భీతహరణిలా ఒదిగిపోయి ప్రతి క్షణం అశ్రునివాళులు అర్పించింది. ఆమె పరిస్థితి చూస్తున్న వారి కళ్లలో సైతం కన్నీళ్లు నిండాయి.
కాగా, కృష్ణంరాజు మొదటి భార్య సీతా దేవి 1995లో కారు ప్రమాదంలో మరణించారు. సీతా దేవి మరణంతో కృష్ణంరాజు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కొన్ని నెలల పాటు నరకం అనుభవించారు. ఈ నేపథ్యంలోనే 1996లో శ్యామలా దేవితో ఆయనకు రెండో వివాహం జరిగింది. రెండో వివాహం తర్వాత కృష్ణంరాజులో చాలా మార్పు వచ్చింది. దానికి ప్రధాన కారణం శ్యామలా దేవి అని చెప్పొచ్చు. అన్ని వేళలా ఆమె భర్తకు తోడునీడలా నిలిచారు. మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. మరి, కృష్ణంరాజు, శ్యామలా దేవి అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Krishnam Raju: కృష్ణంరాజు-శ్యామలా దేవి అనుబంధం! ఇండస్ట్రీ ఆది దంపతులుగా!