తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు వచ్చారు.. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్స్ లేకపోయినా.. చత్రపతి హిట్ తర్వాత ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత జాతీయ స్థాయిలో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ప్రతి చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. బాహుబలి 2 తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ మూవీస్ ప్లాఫ్ అయ్యాయి.. కానీ ప్రభాస్ రేంజ్ ఎక్కడా తగ్గలేదు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఇదే క్రమంలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హర్రర్ డ్రామాగా మరో మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల ఓ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి కాగా మరో షెడ్యూల్ మొదలైంది. ఎలాంటి హడావుడి హంగామా లేకుండా చాలా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ లుక్ ఒకటి లీక్ అయ్యింది. ఈ ఫోటోలో ప్రభాస్ , మారుతి పక్క పక్కనే కూర్చుని సీరియస్ గా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ ఫోటోలో ప్రభాస్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్, నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వింటేజ్ లుక్ లో ప్రభాస్ అదుర్స్ అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ మూవీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కబోతుందట. రాజా డిలక్స్ అనే టైటిల్ను పరిశీలనలో ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించబోతున్నారట. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ నటిస్తున్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ్, యూవీ క్రియేషన్ సంయూక్తంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. మారుతి అంటే కామెడీ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్.. ఆయన దర్శకత్వంలో మంచి హిట్ వస్తుందని అభిమానులు తెగ ఆశలు పెట్టుకున్నారు.
Now You Are Looking At The Biggest Commercial Star Of The Decades The KING RebelStar #Prabhas 👑 From The Sets Of #Prabhas – @DirectorMaruthi ‘s Commercial Entertainer!! pic.twitter.com/Rd9tZALrUC
— Roaring REBELS (@RoaringRebels_) December 24, 2022