ప్రభాస్ పేరు చెప్పగానే భారీ బడ్జెట్ సినిమా, రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ గుర్తొస్తుంది. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా అలాంటివే. కానీ ఓ మూవీ కోసం ప్రభాస్ డబ్బులేం తీసుకోవట్లేదట!
పాన్ ఇండియా హీరో అనగానే.. నిర్మాతలు ఎవరైనా సరే సినిమా బడ్జెట్ వందల కోట్లు పెట్టడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే సినిమా భారీగా ఉండాలి. అన్ని భాషల్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి అనే ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే హీరోలకు కూడా 50 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ అయితే రూ. 100కోట్లకు పైగానే ఇస్తున్నారని సమాచారం. అలాంటిది డార్లింగ్ హీరో.. అస్సలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేస్తాడంటే ఊహించగలమా? కచ్చితంగా జరగని పని అని ఫిక్సయిపోతాం. కానీ అలానే జరిగినట్లు కనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ ముందు వరకు ఓ లెక్క, దాని తర్వాత ఓ లెక్క.. పాన్ ఇండియా స్టార్ వచ్చాడని చెప్పు’ అని ప్రభాస్.. తన వరల్డ్ వైడ్ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చాడు. ఆ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ లాంటి యాక్షన్, లవ్ స్టోరీ మూవీస్ చేశాడు గానీ ప్రేక్షకులు పెద్దగా ఎక్కలేదు. ప్రభాస్ నుంచి భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక డార్లింగ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మూవీ ‘సలార్’. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావడంతో ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు. ఇక సెప్టెంబరు 28న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్-మైత్రీ కాంబో లాంటి బడా బడ్జెట్ సినిమాలు ఇంకా లైన్ లో చాలానే ఉన్నాయి.
అయితే వీటన్నింటి మధ్య తెలుగు డైరెక్టర్ మారుతి తీస్తున్న ఓ సినిమాలోనూ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు. సింపుల్ కాన్సెప్ట్ తీస్తున్న హారర్ డ్రామా ఇది అని అంటున్నారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తీస్తున్నప్పటికీ.. బడ్జెట్ వరకు తక్కువలోనే చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తీస్తుంది ప్రభాస్ సొంత నిర్మాణ లాంటిది అయిన యూవీ క్రియేషన్స్. కాబట్టి ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభాస్ అనుకున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. మరి ప్రభాస్, రెమ్యునరేషన్ కు నో చెప్పాడంటూ వస్తున్న వార్తలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
మారుతి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోని ప్రభాస్?#Prabhas #Maruthi #zeroremuneration #RajaDeluxe #Movie #TelugufilmIndustry #YouSay pic.twitter.com/fcTgO2uqON
— yousaytv (@yousaytv) February 13, 2023