Prabhas: ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని రామ జన్మ భూమి అయిన అయోధ్యలో టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదిపురుష్ సినిమా టీం టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీజర్ కార్టూన్ నెట్‌వర్క్‌లో వచ్చే బొమ్మల షోలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయినప్పటికి ఈ టీజర్ పాత రికార్డులను తుడిచేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. 15 గంటల్లోనే ఈ రికార్డును సాధించింది. కేజీఎఫ్ 2 సినిమాపై ఉన్న పాత రికార్డులను ఈ సినిమా తిరగరాసింది.
కేజీఎఫ్ 2 సినిమా 24 గంటల్లో 68 మిలియన్లను సాధించి రికార్డును క్రియేట్ చేసింది. ఇక, ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ లాంచ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్ కోపంగా సినిమా దర్శకుడు ఓం రౌవత్ను రూమ్‌కు పిలవటం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో.. ప్రభాస్ తన రూములోకి వెళుతూ వెనక్కు తిరిగాడు. డైరక్టర్ ఓం రౌవత్ను పిలుస్తూ.. ‘‘ ఓం.. ఓం ఓసారి నువ్వు నా రూముకు రా’’ అని అన్నాడు. అప్పుడు దర్శకుడు ‘‘ ఓకే డార్లింగ్ ’’ అని సమాధానం ఇచ్చాడు. టీజర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సినిమా టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ కోపం తెచ్చుకున్నాడని, దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోను తమ పుకార్లకు ఆధారంగా చూపుతున్నారు.
ప్రభాస్, ఓం రౌవత్ను తన రూముకు పిలిచి తిట్టారని ప్రచారం చేస్తున్నారు. మరి, ఆ ప్రచారంలో ఎంత నిజముందో తెలియాలంటే ప్రభాస్, ఓం రౌవత్లు కానీ, ఆదిపురుష్ సినిమా టీం కానీ, వివరణ ఇవ్వాల్సి ఉంది. కాగా, ఆదిపురుష్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సీత పాత్రలో కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా జనవరి 13, 2023లో ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్రీడీలో సైతం ఈ సినిమా రిలీజ్ కానుంది.
Itu rara ungaaa nee Pani cheputhaa antundu pic.twitter.com/P71r4BmrxY
— Sagar (@SagarPrabhas141) October 3, 2022