తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో మాస్ హీరోగా ఎంట్రీ ఆచ్చడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘చత్రపతి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి నుంచి ప్రభాస్ కి వరుసగా హిట్స్ కలిసి వచ్చాయి. మరోసారి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి 2 సూపర్ హిట్ తర్వాత వచ్చిన సాహ, రాధేశ్యామ్ నిరాశపరిచాయి. కానీ ప్రభాస్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు.
ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓం రౌనత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ ‘ఆది పురుష్’ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ పై చాలా వరకు నెగిటీవ్ కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా రావణాసురుడు, హనుమాన్ క్యారెక్టర్లు తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నెగిటీవ్ లోనూ ఈ చిత్రం పాజిటీవ్ గానే రికార్డు క్రియేట్ చేసింది. యూట్యాబ్ లో 24 గంటల్లో ఈ టీజర్ అత్యధిక వ్యూస్ సాధించి ట్రెండ్ సృష్టించింది.
ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలో ఉన్న సెలబ్రెటీలపై సర్వే నిర్వహిస్తూ టాప్ పొజీషన్లు ఎవరు ఉన్నారు అన్న జాబితా రిలీజ్ చేస్తుంది. ఈ జాబితాలో రెండు సార్లు ప్రభాస్ టాలీవుడ్ నెం.1 హీరోగా ఉంటూ వచ్చారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన పాపులర్ మేల్ టాలీవుడ్ స్టార్ హీరోల సర్వే జాబితా రిలీజ్ చేసింది ఆర్మాక్స్ సంస్థ. ఈ సర్వేలో ముచ్చటగా మూడోసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో స్థానంలో నిలిచాడు. ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించిన హీరోలు యన్టీఆర్, బన్ని, రామ్ చరణ్ లు ఉన్నారు. తమ అభిమాన హీరో ప్రభాస్ నెంబర్ వన్ జాబితాలో ఉండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Sep 2022) #OrmaxSIL pic.twitter.com/8UbxzMm8P0
— Ormax Media (@OrmaxMedia) October 13, 2022