సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయం.. ఏ మూల జరిగినా గానీ ఇట్టే తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. ఏ చిన్న వేడుక చేసుకున్నాగానీ, పండగలు వచ్చినా గానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సహజమే. అందులో భాగంగానే తాజాగా నటి పూనమ్ కౌర్ కర్వాచౌత్ పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. జల్లెడ పట్టుకుని ఉన్న ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారడంతో నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కర్వాచౌత్ వేడుకను పెళ్లైన మహిళలు జరుపుకుంటారు. మరి నీకు పెళ్లైందా? పూనమ్ కౌర్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పూనమ్ కౌర్.. స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ తర్వాత పూనమ్ కొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ అనుకుంత పేరు మాత్రం రాలేదు. దాంతో క్రమంగా పరిశ్రమకు దూరం అయ్యింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ.. వివాదాలకు తెరలేపుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు వేసే ఘాటు ప్రశ్నలకు.. అంటే ఘాటుగా సమాధానాలను సైతం ఇస్తూంటుంది ఈ అమ్మడు. తాజాగా కర్వాచౌత్ పండుగ సందర్భంగా జల్లెడ పట్టుకుని చంద్రున్ని చూసే ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారడంతో.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అయితే కర్వాచౌత్ వేడుక అనేది ఉత్తర భారతదేశం స్త్రీలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రధానంగా పెళ్లి అయిన మహిళలు పూర్ణిమ రోజున ఉపవాసం ఉండి, పార్వతీదేవిని పూజిస్తూ.. రాత్రి జల్లెడలో చంద్రున్ని చూసి.. అదే జల్లెడలో నుంచి భర్త మెుహాన్ని చూస్తారు. అనంతరం భర్త ఆశీర్వాదాన్ని పొందుతారు. కర్వాచౌత్ ను పెళ్లి కాని స్త్రీలు తమకు కాబోయే భర్తతో కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పూనమ్ కూడా జల్లెడ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న పిక్ ను చూసిన నెటిజన్లు..”పూనమ్ ఈ వేడుకను పెళ్లి అయిన యువతులే నిర్వహిస్తారు.. లేదా కాబోయే వాడితో జరుపుకుంటారు. మరి మీరెందుకు చేసుకుంటున్నారు? మీకు మ్యారెజ్ కుదిరిందా? అది సరే చంద్రుడిని చూసిన అనంతరం మీరు ఎవరి ముఖాన్ని చూస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.