టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ మూవీలో నటించింది. మిస్టీరియస్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో.. పూజా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. మరి గతేడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న పూజా.. మరి ఈ సంక్రాంతికి కూడా రాధేశ్యామ్ తో మరో బ్లాక్ బస్టర్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో తన సెంటిమెంట్ బయట పెట్టింది.
అదీగాక ప్రస్తుతం పూజా దళపతి విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటిస్తోంది. చూడాలి మరి అమ్మడి లక్ ఎలా ఉందో..! ప్రస్తుతం పూజా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా బుట్టబొమ్మ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.