డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్‘. పాన్ ఇండియా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రెండో సినిమాగా రూపొందిన రాధే శ్యామ్.. విడుదలైన మొదటి రోజు నుండే మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమా ఫలితం పై తాజాగా హీరోయిన్ పూజాహెగ్డే స్పందించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మొదటి పాన్ ఇండియా మూవీగా విడుదలైన సినిమాగా రాధేశ్యామ్ నిలిచింది. ఇక ఈ సినిమా పై పూజా స్పందిస్తూ.. ‘ప్రతి సినిమాకి ఏ రిజల్ట్ రావాలనేది దాని డెస్టినీ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తే ఓకే అనిపిస్తాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడతాయి. ఇంకొన్ని సినిమాలు చూడగానే బాగున్నాయి అనిపిస్తాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆడవు’ అంటూ చెప్పినట్లు సమాచారం.
రాధేశ్యామ్ అనంతరం ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు పూజా.. దళపతి విజయ్ సరసన బీస్ట్, మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ, సల్మాన్ ఖాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాలతో పాటు మరికొన్ని లైనప్ చేసుకుంది. ప్రస్తుతం పూజా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పూజా హెగ్డే మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.