Pooja Hegde: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అంటే తెలియని సినీ ప్రేక్షకులుండరు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. హీందీలో తీసింది రెండు మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, పూజాను హీరోయిన్గా పరిచయం చేసిన తమిళంలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పూజా హెగ్డే హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే, ఆమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం నెగ్లెక్ట్ చేయరు.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తరచుగా తన ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా, ఆమె లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. హాట్ లుక్‌లో అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారామె. ఈ ఫొటో షూట్‌ను ‘ధర్మ కార్నర్ ఏజెన్సీ’ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి, పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటో షూట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pooja Hegde: పూజా హెగ్డే భారీ ఖర్చులకు తలలు పట్టుకున్న నిర్మాతలు!