Pooja Hegde: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అంటే తెలియని సినీ ప్రేక్షకులుండరు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. హీందీలో తీసింది రెండు మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, పూజాను హీరోయిన్గా పరిచయం చేసిన తమిళంలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డేపై బీస్ట్ నిర్మాతలు గుర్రుగా ఉన్నారంట. అసలే పెట్టిన పెట్టుబడి తిరిగిరాక ఇబ్బంది పడుతున్న తమకు ఆమె సిబ్బంది ఖర్చులు తలకు మించిన భారంగా మారాయంట. బీస్ట్ సినిమా షూటింగ్‌కు సంబంధించి పూజా హెగ్డే సిబ్బంది చేసిన ఖర్చులు లక్షల్లో ఉన్నాయంట. రెమ్యూనరేషన్‌తో పాటు సిబ్బంది ఖర్చులు కూడా పెట్టుకోవటం తమ వల్ల కాదని తేల్చి చెప్పారంట. ఈ మేరకు ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులను నేరుగా ఆమెకే పంపారని తెలుస్తోంది. కాగా, పూజా హెగ్డే ప్రతి సినిమాకు దాదాపు 3నుంచి 4 కోట్ల రూపాయలు తీసుకుంటారని సమాచారం. రెమ్యూనరేషన్ కాకుండా తన సిబ్బంది ఖర్చులను సైతం నిర్మాతలే భరించాలన్నది ఆమె కండీషన్‌గా తెలుస్తోంది. సిబ్బంది ఖర్చులకు సంబంధించిన విషయాన్ని ముందుగా అగ్రిమెంట్లోనే క్లియర్ కట్‌గా రాయించుకుంటారంట. అయితే, సినిమా హిట్ అయితే పర్లేదు కానీ, సినిమా ఫేయిల్ అయితే మాత్రం నిర్మాతలకు అది తలకు మించిన భారంగా మారుతుందన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. రెమ్యూనరేషన్‌తో పాటు సిబ్బంది ఖర్చులను కూడా భరించమనటం న్యాయం కాదని అంటున్నారు. సినిమా ప్లాప్ అయినపుడైనా దయతల్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి, పూజగా హెగ్డే సిబ్బంది ఖర్చులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Samantha: నాపై వచ్చే రూమర్స్ మాత్రమే నిజాలా? సమంత సంచలన ట్వీట్!