అక్కినేని నాగచైతన్య- సమంత 2021 అక్టోబర్ నెలలో ‘మా దారులు వేరయ్యాయి.. మేము ఇక నుంచి ఎవరి జీవితాన్ని వాళ్లు లీడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ తమ విడాకుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరి కెరీర్లో వాళ్లు బిజీ అయిపోయారు. నాగచైతన్య థాంక్యూ, సమంత- విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తోంది. అయితే ప్రస్తుతం నాగ చైతన్య పర్సనల్ లైఫ్ కు సంబంధించి.. శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడని, గత కొంతకాలంగా వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. శోభితా ధూళిపాళ్ల- నాగచైతన్య డేటింగ్ వార్తలను చైతూ పీఆర్ టీమ్ ఖండించింది. కొందరు కావాలనే నాగ చైతన్యను టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ చైతూ పీఆర్ టీమ్- ఫ్యాన్స్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శోభితా ధూళిపాళ్ల- నాగచైతన్య ప్రేమలో ఉన్నారన్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదంటూ వీరు కొట్టిపారేశారు. అయితే.. నాగచైతన్య పీఆర్ టీమ్ చేసిన ఈ పోస్టింగ్స్ పై సమంత తన ట్విట్టర్ ఖాతాలో ఘాటుగా స్పందించింది. "అమ్మాయిపై వచ్చే వార్తలన్నీ కచ్చితంగా నిజాలు.. అబ్బాయిపై వచ్చే రూమర్స్ మాత్రం ఓ అమ్మాయి కావాలని చేయిస్తున్నట్లు. ఇప్పటికైనా ఎదగండి.. ఇరు వర్గాలు తమ జీవితాల్లో స్పష్టంగా ముందుకెళ్లిపోయారు. మీరు కూడా మీమీ జీవితాల్లో ముందుకు వెళ్తే బావుంటుంది. మీ పని, మీ కుటుంబాలపై దృష్టి సారించండి" అంటూ సమంత తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Rumours on girl - Must be true !! Rumours on boy - Planted by girl !! Grow up guys .. Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6 — Samantha (@Samanthaprabhu2) June 21, 2022 ఇదీ చదవండి: నటి స్వాతి సర్జరీ విషయంలో వెలుగులోకి సంచలన విషయాలు.. ఇదీ చదవండి: షాకింగ్: బుల్లితెర నటి రష్మీ ఆత్మహత్య..!