పాయల్ రాజ్ పుత్.. RX100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడుకి ఆ తర్వాత బాగానే గుర్తింపు లభించింది. నెగెటివ్ రోల్ తో తెలుగులో కెరీర్ ప్రారంభించినా కూడా.. ప్రేక్షకుల నుంచి ఆమె నటనకు మంచి ఆదరణే లభించింది. కానీ, అవకాశాల పరంగా చూసుకుంటే తెలుగులో ఆమె టాలెంట్ కు తగ్గ పాత్రలు దక్కలేదనే చెప్పాలి. డిస్కో రాజా, వెంకీ మామలాంటి పెద్ద చిత్రాలు పడినా అవి ఆమె కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. క్యూట్ గా బబ్లీగా ఉంటే అవకాశాలు రావడం లేదు అనుకుందో ఏమో.. పాయల్ రాజ్ పుత్ పంథా మార్చేసింది. ప్రస్తుతం ఫిట్ నెస్ పై దృష్టి సారించింది.
బబ్లీ బబ్లీ లుక్ నుంచి ఫిట్ లుక్ లోకి మారిపోయింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ పిక్ అయితే ‘నా కొలతలు మారాయి’ మీరు గమనించారా అనేలా ఉంది అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా పాయల్ రాజ్ పుత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఆమె ఫిజిక్ మీద దృష్టిపెట్టి, ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలాగా నాజూకుగా మారితే తప్పకుండా ఆమెకు కెరీర్ లో చాలా మంచి అవకాశాలు వస్తాయని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ చేతిలో తెలుగు, తమిళ, కన్నడ భాష్లలో కలిపి మొత్తం ఐదు చిత్రాలు ఉన్నాయి. తమిళ్ లో ఏంజల్, గోల్ మాల్ చిత్రాల్లో నటిస్తుండాగ.. తెలుగులో కిరాతక, మరో చిత్రంలో నటిస్తోంది. హెడ్ బుష్ అనే సినిమాతో అటు కన్నడలో ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనుంది. పాయల్ రాజ్ పుత్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.