పాయల్ రాజ్ పుత్.. Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తర్వాత తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బోల్డ్ పాత్రలే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ లోనూ సందడి చేసింది. పంజాబీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో నటించి మెప్పించింది. 2020లో చేసిన అనగనగా ఓ అతిథి తర్వాత ఈ రెండేళ్లు టాలీవుడ్ కు దూరంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పాయల్ రాజ్ పుత్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ బుల్లితెరపై తళుక్కు మంది. అది కూడా ఒక్కతే కాకుండా జంటగా వచ్చింది. తన ప్రియుడు సౌరభ్ దింగ్రాతో కలిసి ఓ డ్యూయట్ సాంగ్ చేసింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాయల్ రాజ్ పుత్- సౌరభ్ దింగ్రా జీ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక డ్యూయట్ సాంగ్ చేశారు. అక్కడితే ఆగితే ఇంత వైరల్ అయ్యేది కాదేమో.. చివర్లో తన ప్రియుడికి లిప్ టూ లిప్ కిస్ ఇవ్వడంతో ఆ ప్రోమో కాస్తా యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. అయితే పాయల్ రాజ్ పుత్ సురభ్ తో కలిసి డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
చాలా రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రేమికుల దినోత్సవం రోజు పాయల్ తన ప్రియుడిని పరిచయం చేసింది. సౌరభ్ దింగ్రాతో కలిసి డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, సరదాగా గడపటం చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు. ప్రస్తుతం జీ మహోత్సవంలో కనిపించడంతో మళ్లీ ఈ జంట వార్తల్లో నిలిచింది.
సౌరభ్ దింగ్రా యాక్టర్ మాత్రమే కాదు మోడల్, ప్రొడ్యూసర్ కూడా. అంతేకాకుండా చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం ఈ జంటకు దక్కింది. అదేంటంటే.. 3రోజెస్ వెబ్ సిరీస్ లో సౌరభ్ దింగ్రా- పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. రియల్ లైఫ్ ప్రేమికుల్లో చాలా తక్కువ మందికే ఇలా రీల్ లైఫ్ లో ప్రేమ జంటే అయ్యే అవకాశం దక్కింది. సౌరభ్- పాయల్ రాజ్ పుత్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.