పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా పయనిస్తున్నాడు. టాలీవుడ్ లో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని టాప్ హీరోల్లో అగ్ర భాగాన కొనసాగుతున్నారు. గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. దీంతో పవన్ మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టడేమో అని అందరు అనుకుంటున్న తరుణంలోనే వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో లాయర్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది.
కరోనాను సైతం లెక్కచేయకుండా అభిమానులు సినిమా థియేటర్ లోకి వెళ్లి మరి చూశారు. ఈ మూవీతో బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాల్లో పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరహర వీర మల్లు అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం పట్టాలపై ఉండగానే మరి కొన్ని సినిమాలకు సైన్ చేస్తూ బిజీబిజీగా మారిపోయాడు ఈ వకీల్ సాబ్. కాగా పవన్ హీరోగా అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.
ఇదే చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో పవన్ పోలీస్ డ్రెస్ ధరించి నిలుచున్నాడు. ఈ లుక్ తో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి ప్రారంభమవ్వటం విశేషం. ఇక ఇందులో పవన్ బీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీంతో పాటు రానా కూడా ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్, సాయి పల్లవి నటించబోతున్నారు.