టాలీవుడ్ లో మోస్ట్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. వకీల్ సాబ్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పవన్.. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో అభిమానులలో ఫుల్ జోష్ నింపారు. ఓవైపు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఏపీ రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూ.. మరోవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, సముద్రఖనితో వినోదయ సితం రీమేక్ లను లైనప్ చేశారు. వీటిలో మొదటగా హరిహర వీరమల్లు సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డారు పవన్. గతేడాది మొదలైన ఈ సినిమా షూటింగ్.. మధ్యమధ్యలో పలు అవాంతరాల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది.
అదీగాక ఆల్రెడీ వీరమల్లు మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేయగా ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు మేకర్స్. తాజాగా షూటింగ్ పునఃప్రారంభించే పనిలో ఉన్నారు. దీంతో షూటింగ్ సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. పీరియాడిక్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వీరమల్లుగా సాహసాలు చేయబోతున్నాడు. అయితే.. వీరమల్లు ప్రాక్టీస్ సెషన్స్ లో నుండి పవన్ కి సంబంధించి కొత్త పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. ఆ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేశారు.
ప్రస్తుతం పవన్ ప్రాక్టీస్ పిక్ చూసి ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. పవన్ వింటేజ్ మేజిక్ రిపీట్ కాబోతుందని, వీరమల్లులో ఆయన విశ్వరూపం మరోసారి చూడబోతున్నాం అంటూ అభిప్రాయాలు బయట పెడుతున్నారు. ఇక వీరమల్లులో పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. మరి అభిమానులలో భారీ అంచనాలు సెట్ చేసిన వీరమల్లు మూవీ.. తెరపైకి ఎప్పుడు వస్తుందో గానీ.. అప్పుడప్పుడు ఇలా రిలీజ్ చేస్తున్న ఫొటోస్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక చూడాలి మరి పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడిక్ మూవీతో ఎలా అలరిస్తాడో!
Sneak peek of our #HariHaraVeeraMallu @PawanKalyan garu in the #PracticeSession @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra @cinemainmygenes @benlock #NeetaLulla pic.twitter.com/BVYMLiGPf4
— Mega Surya Production (@MegaSuryaProd) October 10, 2022