సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల వార్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రతి ఏడాది ఇలాంటి సీన్ కామన్ అయినా, ఈసారి ఈ పోటీ మరింత ఎక్కువ అయ్యింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు విడిదలకి నోచుకోలేకపోయిన పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు పెద్ద పండగని టార్గెట్ చేసుకుని విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలు సైతం థియేటర్స్ లో విడుదలకి డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇంత పోటీ ఉండటంతో ఓ మోస్తరు స్టార్స్ అంతా ఈసారి సంక్రాంతి సినీ వార్ నుండి తప్పుకున్నారు. కానీ.., పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు కదా? ఆయన మాత్రం ఎట్టి పరిస్థితిల్లో సంక్రాంతి పోటీ నుండి తప్పుకునేది లేదని ఫిక్స్ అయిపోయారట.
జనవరి 07 న RRR , జనవరి 14న రాధేశ్యామ్ విడుదల కావడం ఇప్పటికే ఖాయం అయిపోయింది. ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఇక వీటికి తోడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కార్ వారి పాట జనవరి 13న విడుదలవుతోంది. ఇది రీమేక్ కాదు. స్ట్రైట్ మూవీ. సో.. ఇంత పోటీ నడుమ భీమ్లా నాయక్ వెనక్కి తగ్గొచ్చు అన్న టాక్ ఇటీవల ఫిలింనగర్ వర్గాల్లో వినిపించాయి. కానీ.., ఇప్పుడు బీమ్లా నాయక్ టీమ్ ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదట. భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాష్ తో 2022 జనవరి 12న బిగ్ స్క్రీన్ వెలిగిపోతుంది అంటూ సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ ట్వీట్ చేశారు.
నిజానికి అందరికన్నా ముందుగా సంక్రాంతి స్లాట్ ని బుక్ చేసుకుంది పవన్ కళ్యాణ్. దీంతో.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కి తగ్గి వెనకడుగు వేయడానికి ఆయన సముఖత వ్యక్తం చేయలేదట. ఎలాగో.. పవన్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆయన ఫ్యాన్ బేస్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇంత ఫాలోయింగ్ ఉండి కూడా డేట్ మార్చడం కరెక్ట్ కాదని, ఫ్యాన్స్ పై నమ్మకంతోనే పవన్ ఇలా ముందడుగు వేస్తున్నట్టు సమాచారం. మరి.. సంక్రాంతి బరిలో పాన్ ఇండియా సినిమాల హైప్ ను తట్టుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ కలెక్షన్స్ రాబట్టగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.