Pavitra Lokesh About Her Husband Suchendra Prasad: పవిత్ర లోకేష్.. సినిమాల వల్ల ఆమెకు ఎంత గుర్తింపు వచ్చిందో తెలియదు కానీ.. సీనియర్ హీరో నరేష్‌తో పెళ్లి వార్తలతో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే మూడు సార్లు విడాకులు తీసుకున్న సీనియర్ నటుడు నరేష్‌ని ఆమె నాలుగో వివాహం చేసుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. వీరిద్దరూ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారని.. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాక.. నరేష్ కుటుంబంలో జరిగే ఫంక్షన్లకు పవిత్ర హాజరుకావడం.. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ మహాబలేశ్వరం వెళ్లడంతో.. ఇక వీరు పెళ్లి చేసుకోవడం పక్కా అనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమేనని నరేష్ వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు. ఇక వారిద్దరూ మహాబలేశ్వరం వెళ్లింది కూడా సినిమా పని మీదే అని తెలిపారు. మరి వీరి పెళ్లి వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించలేదు. ఈ క్రమంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది. దీనిలో పవిత్ర లోకేష్.. తన భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి, వారి బంధం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
పవిత్ర లోకేష్ ఇంటర్వ్యూలో తన భర్త గురించి మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం కలిసి ఒక సీరియల్‌లో నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన(సుచేంద్ర ప్రసాద్) చాలా గొప్ప వ్యక్తి. నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా బెటర్ పర్సన్. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేం. ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు’’ అని పవిత్ర తెలిపారు.
ఇది కూడా చదవండి: OTT Movies: రేపు ఒక్కరోజే రిలీజ్ కాబోతున్న 12 ఓటిటి సినిమాలు!
‘‘ఆయన రచయిత, దర్శకుడు, నటుడు కూడా. కానీ, నాకు ఆయన నటుడిగానే నచ్చుతారు. ఇద్దరు కలిసి జంటగా నటించే అవకాశం వచ్చింది. కానీ, ఇద్దరం ఒకేసారి షూటింగ్‌కు వెళ్తే పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరని.. ఆ అవకాశాలను వదులుకొనేవాళ్లం. అలాంటి భర్త దొరికినందుకు నేను చాలా లక్కీ. కొంచెం టైమ్ ఉన్నా సరే సుచేంద్ర నా కోసం వంట చేస్తారు.. ఇంటి పనులు అన్ని చేస్తారు’’ అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: పూరీ జగన్నాథ్ చుట్టూ ర్యాంప్ లు, వ్యాంప్ లు మధ్యలో వచ్చారు: బండ్ల గణేష్!
‘‘నా విషయంలో ఆయన చాలా పొసేసివ్‌గా ఉంటారు. నేను ఆయనకే సొంతమని భావించేవారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. నేను కూడా ఏ రోజు ఒత్తిడి చేయలేదు. నా సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం ఏమిటని కూడా అడగలేదు. ఆయన కూడా తనకు ఏ సినిమా నచ్చిందనే విషయాన్ని చెప్పరు. ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాలు గురించి మేం మాట్లాడుకోం’’ అని పవిత్ర ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, పవిత్ర లోకేష్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారా.. లేక కుటుంబంతో కలిసి ఉంటున్నారా అనేది తెలియదు. ప్రస్తుతం వస్తున్న పుకార్లపై పవిత్ర లోకేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.