బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్డమ్ ని కొనసాగిస్తున్నాడు. కానీ.. గత కొన్నాళ్లుగా సరైన సాలిడ్ హిట్ కోసం తడబడుతున్నాడు. ఓవైపు సౌత్ హీరోలు, యంగ్ హీరోలు సూపర్ హిట్స్ తో దూసుకుపోతుంటే.. షారుఖ్ నుండి నాలుగేళ్లుగా సినిమాలు రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తర్వాత షారుఖ్ కి ఆ స్థాయి హిట్ పడలేదు. కానీ.. రీసెంట్ గా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ‘పఠాన్’ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే సాంగ్స్ వచ్చాక వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ, ట్రైలర్ వచ్చాక సినిమాపై హైలీ పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఈ క్రమంలో రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి భారీ యాక్షన్ హిట్స్ అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి నిర్మాణంలో తెరకెక్కించాడు. ఎట్టకేలకు ఒక పాజిటివ్ వైబ్ మధ్య హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో రిలీజైన పఠాన్ మూవీ.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ కి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ అందించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీపికా పదుకొనే గ్లామర్ తో పాటు పఠాన్ కి జాన్ అబ్రహం విలనిజం.. యూనిక్ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్, సల్మాన్ ఖాన్ ఎంట్రీ లాంటి ఫ్యాన్స్ మెచ్చే పాయింట్స్ అన్ని తోడయ్యేసరికి సినిమా రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూసుకుంటే.. పఠాన్ మూవీ షారుఖ్ కెరీర్ లో బెస్ట్ తో పాటు ఇప్పటివరకు హిందీలో కేజీఎఫ్ 2 సెట్ చేసిన రూ. 54 కోట్ల నెట్ రికార్డుని క్రాస్ చేసిందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు.. పఠాన్ మూవీ ఫస్ట్ డే.. బాలీవుడ్ బెల్ట్ లో రూ. 65 కోట్లు వరకూ గ్రాస్, రూ. 55 కోట్లు వరకూ నెట్ కలెక్సన్స్ వచ్చాయట. ఇందులో అడ్వాన్స్ సేల్స్ ద్వారానే రూ. 27.12 కోట్లు నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ లో షారుఖ్ ఫ్యాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఏకంగా ఓవర్సీస్‌లో మాత్రమే రూ.38 కోట్ల వరకు రాబట్టి అద్భుతం సృష్టించిందని అంటున్నారు. ఇండియాలో టాప్ మూవీగా ‘పఠాన్’ మొదటి రోజు రూ. 103 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు.
ఇందులో తెలుగు, తమిళ కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. సౌత్ లో సుమారు రూ. 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి దాదాపు రూ. 250 – 260 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే సినిమాని 8 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారట. అదీగాక ఓవర్సీస్ లోనే కాకుండా ఆయా దేశాలలో పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ హాఫ్ మిలియన్ డాలర్స్ కి పైగా వసూల్ అయ్యాయట. మరి షారుఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీగా వచ్చిన పఠాన్.. సాలిడ్ టాక్ కి తోడు వీకెండ్ వరకు రూ. 300 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. మరి పఠాన్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
SRK has just opened the floodgates for Bollywood#Pathaan becomes the 1st Bollywood movie to hit the ₹100 Crore + Gross Worldwide on Day 1
King Khan setting the standards as he often does for Bollywood pic.twitter.com/YAZgdBsrLS
— ForumKeralam (@Forumkeralam2) January 26, 2023