ప్రస్తుతం సినిమాల్లో విలన్‌లు హీరోలకు ధీటుగా అందంగా ఉంటున్నారు. కానీ ఓ పాతికేళ్ల క్రితం సినిమాలు చూడండి.. విలన్ అంటే ఎంత భయంకరంగా ఉంటాడో అర్థం అవుతుంది. అలా తెలుగు తెర మీద విలన్‌గా నటించి.. ప్రేక్షకులను భయపెట్టిన ఓ నటుడు ప్రస్తుతం ఎవరూ ఊహించని రంగలో దూసుకుపోతున్నాడు.
జీవితంలో మనం రాలు దేలాలంటే.. బలమైన కష్టాలను చవి చూడాలి. అలానే సినిమాలో విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. హీరో అంతలా ఎలివేట్ అవుతాడు. హీరో-విలన్ ఇద్దరూ సమ ఉజ్జీలయితనే.. వారి మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడంటే మన సినిమాల్లో విలన్లు.. మంచి డిజైనర్ వేర్‌లో సిక్స్ ప్యాక్ బాడీతో.. మోడల్స్‌కు ధీటుగా అందంగా ఉంటున్నారు. కొన్ని సార్లే.. హీరోలే విలన్‌లుగా మారుతున్నారు. కానీ ఓ పాతికేళ్ల క్రితం వరకు కూడా సినిమాలో విలన్ అంటే.. చిన్నాపెద్దా, ముసలి-ముతక అందరూ భయపడాల్సిందే. చిన్నారులయితే.. బూచాడు పేరు చెబితే ఎంతలా భయపడతారో.. సినిమాలో విలన్‌ని చూసి అంతలా భయపడాలని దర్శకులు భావించేవారు. విలన్ పాత్రల్లో నటించే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. వేరు వేరు ఇండస్ట్రీల నుంచి వెతికి మరీ ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చేవారు. అలా తెలుగు తెరకు పరిచయమయిన విలనే బాబు ఆంటోనీ
ఎవరు ఈ బాబు ఆంటోనీ అని ఆలోచిస్తున్నారా.. చిరంజీవి హీరోగా నటించిన పసివాడి ప్రాణం సినిమా చూశారా.. దానిలో చిన్న బాబుని కిడ్నాప్ చేసే పాత్రలో.. కనిపించి.. తెర మీద బాబునే కాక.. సినిమా చూస్తున్న ప్రేక్షకులను కూడా భయపెట్టిన విలనే ఈ బాబు ఆంటోనీ. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా పలు భాషల సినిమాల్లో నటిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఎక్కువగా విలన్ పాత్రల్లోనే నటించినప్పటికి.. మిగతా భాషల చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో జేబు దొంగ, పసివాడి ప్రాణం, శత్రువు, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు, తాజాగా వచ్చిన కాంచన చిత్రాల్లో నటించాడు. త్రినేత్రుడ, పసివాడి ప్రాణం సినిమాలు అంటోనికి మంచి గుర్తింపు తెచ్చాయి. సినిమాల్లో ఈయనకు ఎక్కువగా డైలాగ్స్ ఉండేవి కాదు.. నటనతోనే ప్రేక్షకులను భయపెట్టి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఆంటోనీ వ్యక్తిగత విషయానికి వస్తే.. కేరళ రాష్ట్రానికి చెందని వ్యక్తి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుననాడు. తెలుగులో విలన్ పాత్రల్లో నటించినప్పటికి.. మిగతా భాషల్లో హీరోగా వెలుగొందాడు. పుణెలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. తెలుగులో సినిమాలు చేయక చాలా రోజులు అవుతుంది. తాజాగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. బాబు ఆంటోనీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మొత్తం ఐదు భాషల్లో కలిపి 175 వరకు చిత్రాల్లో నటించాడు. మలయాళ చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ వేడుకల్లో బాబు ఆంటోనీని ఘనంగా సత్కరించారు.
ఇక బాబు ఆంటోనీ.. రష్యన్ అమెరికన్ మహిళ ఇవగెనియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు సంతానం. ఆర్థర్ ఆంటోనీ, ఆలెక్స్ అంటోనీ వారి పేర్లు. ప్రస్తుతం బాబు ఆంటోనీ సినిమాల్లో నటించడమే కాక కోచింగ్ సెంటర్ ఒకటి ప్రారంభించాడు. మార్షల్ ఆర్ట్స్‌లో కోచింగ్ ఇస్తున్నాడు. తన పేరు మీదనే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ స్థాపించాడు. దీని బ్రాంచ్‌లు మన దేశంలోనే కాక అమెరికాలో కూడా ఉంది. ఇక బాబు ఆంటోనీ స్వయంగా మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఆ రంగం మీద ఆసక్తి ఉండటంతో.. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ స్థాపించి.. శిక్షణ ఇస్తున్నాడు. బాబు ఆంటోనీ నటుడు మాత్రమే కాక దర్శకుడు కూడా. మరి పసివాడి ప్రాణం చిత్రంలో బాబు ఆంటోనీ నటన మీకు నచ్చిందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.