గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. శుక్రవారం ప్రముఖ మలయాళ నటుడు వీపీ ఖలీద్ మరణించిన వార్త మరువక ముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ ఒడియ నటుడు రాయ్ మోహన్ ఫరిదా తన గదిలో ఉరివేసుకుని మృతి చెందారు.. 58 ఏళ్ల ఫరిదాకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
ఒడియా ఇండస్ట్రీలో నెగిటీవ్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న రాయ్‌మోహన్ పరిదా (58) ఆయన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే రాయ్ మోహన్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పపడ్డాడు అన్న విషయం పై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, రాయ్‌మోహన్ మరణవార్తతో ఒడియా సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
ఒడియా ఇండస్ట్రీకి చెందిన రాయ్ మోహన్ ఎక్కువగా నెగిటీవ్ పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఒడియాలో దాదాపు వంద చిత్రాలకు పైగా ఆయన 15 బెంగాలీ చిత్రాల్లో కూడా నటించారు. కేవలం విలన్ గానే కాకుండా కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు ఫరిదా. ఫరిదా మరణవార్త తెలుసుకున్ని సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
Shri #RaimohanParida will be remembered for his versatile acting. He will be loved and admired for years to come. Pained by his demise. May his soul rest in peace. 🙏 pic.twitter.com/kU2aNHYubZ
— Niranjan Patnaik (@NPatnaikOdisha) June 24, 2022