నోరా ఫతేహి.. ఈ కెనెడియన్ నటి, డాన్సర్, మోడల్‌కు ప్రంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్‌లో ఈమెను ఆరాధించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందం, అభినయం, నృత్యంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. టెంపర్, బాహుబలి సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. స్పెషల్ సాంగ్స్ తో చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద తన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసింది. అయితే ఆ సమయంలో ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు ట్రోలింగ్‌కు గురిచేస్తోంది. అంతేకాకుండా ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నెట్టింట డిమాండులు చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. నోరా ఫతేహీ ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్‌పై అద్భుతంగా ప్రదర్శన చేసింది. ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి మాట్లాడింది కూడా. ఆ గ్యాప్‌లో ఒకరు స్టేజ్ ముందు ఉండి జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. అది చూసిన నోరా ఫతేహి.. జెండాను ఇవ్వమని కోరింది. ఆ వ్యక్తి జాతీయ జెండాను అందివ్వగా.. మువ్వన్నెల జెండాను ఫిఫా స్టేజ్‌పై గర్వంగా ప్రదర్శించింది. ఆ తర్వాత ఆమె కంగారో, గమనించకపోవడమో.. జెండాను తలకిందులుగా పట్టుకుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను అలా ఎలా పట్టుకుంటుంది అంటూ పెదవి విరుస్తున్నారు. నోరా ఫతేహీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
Nora Fatehi Live Performance in Qatar. FIFA World Cup Qatar 2022. #FIFAWorldCup #FIFAWorldCupqatar2022 #FIFAFanFestival #NoraFatehi #livedance #liveperformance pic.twitter.com/kRP0gh6EnY
— Bipin Kumar Pal (@webbipinpal) November 29, 2022
నిజానికి నోరా ఫతేహి కెనడియన్. కాకపోతే బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. భారతీయురాలు కాకపోయినా కూడా.. ఇక్కడే స్థిరపడిన అభిమానంతో జాతీయ జెండాను ఫిఫా స్టేజ్‌పై ప్రదర్శించింది. అంతేకాకుండా.. “ఫిఫా వరల్డ్ కప్‌లో ఇండియన్ జట్టు లేదు. కానీ, మ్యూజిక్- డాన్సుతో ఇప్పుడు మనం కూడా ఫిఫా వరల్డ్ కప్‌లో భాగం అయ్యాం” అంటూ ఎంతో గొప్పగా వ్యాఖ్యానించింది. అందిరోత జైహింద్ అని కూడా నినాదాలు చేయించింది. మొదట సరిగ్గానే పట్టుకున్న నోరా.. ఆ తర్వాత కాస్త కంగారులో తిప్పి పట్టుకుంది. నోరా ఫతేహి ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ దాకా మువ్వన్నెల జెండాను తీసుకెళ్లింది. ఆమె పొరపాటున చేసిన పనిని పట్టుకుని ఇలా ట్రోలింగ్ చేయడం సరైంది కాదంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Shame on you #NoraFatehi for disrespecting our national flag, Tiranga🇮🇳. At #FIFAWorldCup event!
Totally intolerable. Absolutely condemnable, and actionable act. pic.twitter.com/0z921AE4KP
— Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) December 2, 2022
We are spellbound as #NoraFatehi takes over the international stage with her killer performance at the FIFA FanFest! pic.twitter.com/cMhOOiDMSz
— E24 (@E24bollynews) December 1, 2022