ఎక్స్ప్రెషన్ క్వీన్ నివేదా థామస్ నటించిన తాజా సినిమా శాకిని డాకిని. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెజీనా, నివేదా థామస్ ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్ ఇద్దరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా షాలిని పాత్ర కోసం నివేదా థామస్ చాలా కష్టపడింది. ఇక సినిమా రిలీజ్ కి ముందు నుంచి ప్రమోషన్ ఓ రేంజ్ లో చేశారు. రిలీజ్ అయ్యాక కూడా నివేదా థామస్ సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తన ముఖంపై గాయాలు ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే నివేదా థామస్ ఫేస్ అంటే ఫ్యాన్స్ కి పిచ్చి. అలాంటి మొఖం మీద రక్తపు మరకలు ఉన్నాయి. కుడి కనుబొమ్మ పైన, ఎడమ బుగ్గ మీద, కింది పెదవి కుడి భాగంలో దెబ్బ తగిలి రక్తస్రావం అవుతున్న ఫోటోని షేర్ చేసింది.
ఆదమరుపుగా చూస్తే నిజంగానే నివ్వి బ్యూటీకి గాయాలు అయ్యాయేమో అని అనిపిస్తుంది. అయితే ఒకసారి నిదానంగా చూస్తే అది మేకప్ అని అర్ధమవుతుంది. అవును అది ‘శాకిని డాకిని’ సినిమాలోని పోరాట సన్నివేశాల కోసం వేయించుకున్న మేకప్. బ్లడ్-వర్క్ మేకప్ లో రియల్ గా గాయాలు అయినట్లు, అది నిజంగానే రక్తంలా అనిపిస్తుంది. మేకింగ్ సీన్స్ లో భాగంగా తీసిన స్టిల్స్ ని ఆమె ఇలా ప్రమోషన్ కోసం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. నాలుగు ఫోటోలని షేర్ చేసింది.
ఒక ఫోటోలో సీరియస్ గా చూస్తూ.. చూపులతోనే చంపేసేలా ఉంది. ఈ మధ్యలో మూడు ఫోటోలు ఫైట్ సీన్స్ కి సంబంధించినవి. లాస్ట్ ఫోటో మాత్రం మానిటర్ లో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది చూసుకుంటుంది. అదన్నమాట.. తన ఫోటోలు చూసి అందమైన నివేదా ఫేస్ మీద నిజంగా గాయాలు అయ్యాయని అనుకుంటారేమో అని ముందుగానే నివ్వి.. డిస్క్లైమర్ ఇచ్చేసింది. మరి నివేదా షేర్ చేసిన ఈ ఫోటోలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.