సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్.. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అటు ఫ్యామిలీకి, ఇటు అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. తాజాగా తన బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసిన కాజల్.. కొడుకు పేరును కూడా వెల్లడించడం విశేషం. ఇంతకీ కాజల్ కొడుకు పేరు ఏంటని అనుకుంటున్నారా..? ఆ వివరాలేంటో చూద్దాం.
2020 కరోనా లాక్ డౌన్ సమయంలో కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. అప్పటినుండి సినిమాలు అడపాదడపా చేస్తోంది. అయితే.. పెళ్ళైన కొన్ని నెలలకే ప్రెగ్నన్సీ న్యూస్ బయటపెట్టిన కాజల్.. బేబీ షవర్ వేడుకలు జరుపుకొని వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవలే తన భర్తతో కలిసి ‘బాబు’ పుట్టాడని చెప్పి సర్ప్రైజ్ చేసింది.
ఇది కూడా చదవండి: నీలా ఎవ్వరూ ఉండరు నాయనమ్మ.. సితార పోస్ట్ వైరల్!
ఇక ఏప్రిల్ 19న కాజల్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. అందరూ పుట్టిన బాబు పేర్లను పెద్దగా ఫంక్షన్ ఏర్పాటుచేసి అనౌన్స్ చేయడం చూస్తుంటాం. కానీ కాజల్ తన కొడుకు పేరు విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చేసింది. ఎలాంటి సస్పెన్స్ లేకుండా కాజల్ సోదరి నిషా అగర్వాల్.. బాబు పేరు ‘నీల్ కిచ్లు’ అని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పేసింది. ప్రస్తుతం కాజల్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా.. కాజల్ చివరిగా నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది. మరి కాజల్ అగర్వాల్ కొడుకు ‘నీల్ కిచ్లు’ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.