టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు కూతురు సితార తాజాగా తన నాయనమ్మ ఇందిరాదేవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ విష్ చేసింది. ఫోటోతో పాటు ‘హ్యాపీ బర్త్ డే నాయనమ్మ.. నీలా ఎవ్వరూ ఉండరు. లవ్ యూ సో మచ్’ అంటూ నాయనమ్మపై ప్రేమను బయటపెట్టింది. సాధారణంగా ఇందిరా దేవిగారు ఫ్యామిలీ ఫంక్షన్స్ తోపాటు సోషల్ మీడియాలో కనిపించడం అరుదు. తాజాగా సితార ఆమె ఫోటో షేర్ చేసేసరికి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా.. తల్లి ఇందిరా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మ.. మిమ్మల్ని ప్రేమించడానికి ఒకరోజు సరిపోదు.. ఎప్పటికి ప్రేమిస్తాను” అంటూ పోస్టులో తల్లిపై ప్రేమను వెలిబుచ్చాడు. మహేష్ తో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇందిరా దేవి గారికి పుట్టినరోజు విషెస్ చెప్పారు.
View this post on Instagram
Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always 🤗🤗🤗 pic.twitter.com/92aqNPmUQR
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022
అదేవిధంగా మహేష్ బాబు సోదరి మంజుల కూడా తన అమ్మకు విషెస్ చెప్పింది. ఆమె షేర్ చేసిన ఫోటోలో సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులంతా కనిపించారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. లవ్యూ మూన్ అండ్ బ్యాక్..ఇన్నేళ్లుగా నువ్ మాకు పంచుతున్న ప్రేమకు రుణపడి ఉంటామని’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
