తెలుగు చిత్ర పరిశ్రమలో కొణిదెల నాగబాబు నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే నాగబాబు చేతికి గాయం అయినట్లుగా ఓ వీడియో తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో నాగబాబు కుడి చేతికి గాయం తగలడంతో బ్యాండేజ్ వేసుకున్నాడు. దీనిని చూసిన మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక తండ్రి నాగబాబు పక్కన కూర్చున్న నిహారిక గాయం నొప్పిపై తండ్రితో మాట్లాడుతూ ఉంది. నాన్న నొప్పిగా ఉందా అంటూ తండ్రితో ప్రేమగా మాట్లాడుతోంది.
నాన్న నీ నొప్పిని నేను తగ్గిస్తాను నాన్న. లేదమ్మ డాక్టర్ మందులిచ్చాడు తగ్గిపోతోంది లే అంటూ వీడియోలో తెలిపాడు. దీంతో వెంటనే కూతురు నిహారిక నవ్వుతూ తండ్రి ఏడమ చెయిని పంటితో కొరుకుతుంది. ఇక విలవిలలాడిన నాగబాబు వద్దు వద్దు అంటూ తన చెయిని లాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను నిహారిక, నాగబాబు తమ సోషల్ మీడియాలో ఖాతాలో అప్ లోడ్ చేసి తమ అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.