ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఇలా ఏ విధంగానైనా పైకి రావడం అనేది చాలా ఏళ్ళ కృషి, హార్డ్ వర్క్ తో కూడుకున్న విషయం. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏదొక దాంట్లో అవకాశాలు అందుకోవడం ఈజీ అవుతుందేమో.. కానీ, ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు బుల్లితెరపై మెగాస్టార్ అనిపించుకున్న నటుడు ప్రభాకర్. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు.. సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని విధాలా సీరియల్స్, సినిమాలపై తన ముద్రవేశారు. అయితే.. దాదాపు ఇరవై ఐదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రభాకర్.. ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా టాలీవుడ్ డెబ్యూ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇటీవలే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిమరీ తనయుడి డెబ్యూ మూవీని అనౌన్స్ చేసిన ప్రభాకర్.. ప్రెస్ మీట్ లోనే కొడుకు బర్త్ డేని సెలబ్రేట్ చేయడం విశేషం. ఇక చిన్నప్పటి నుండి సినిమాలపై ఇంటరెస్ట్ ఉన్న చంద్రహాస్.. తన ఇరవై రెండో పుట్టినరోజున హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అయితే.. చంద్రహాస్ ఎప్పుడైతే సినీ హీరోగా డెబ్యూ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడో.. అప్పటినుండి సోషల్ మీడియా ట్రోల్స్ లో బాగా వైరల్ అవుతున్నాడు. అలాగే చంద్రహాస్ పేరు కూడా ట్రోల్స్, మీమ్స్ ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో కొడుకు చంద్రహాస్ పై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూనే, కొడుకు సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందనేది చెప్పుకొచ్చాడు ప్రభాకర్.
ఇక ఇండస్ట్రీలోకి వారసుడిని దింపుతున్నారు? అనే ప్రశ్నపై ప్రభాకర్ స్పందిస్తూ.. “మేమేం దింపలేదు తనే దిగాడు. ఎంత నేను సినిమా డైరెక్టర్ అయినా మావాడితో సినిమా చేయాలని అనుకోలేదు. కానీ.. బయట బ్యానర్స్ లో వస్తే చేద్దామని అనుకున్నాం. అయితే.. డిగ్రీ పూర్తి చేశాక వేరే ఏమైనా నేర్చుకోమని చెప్పాను. కానీ. వాడికి ఏమి సెట్ అవ్వట్లేదని సినిమాల్లోకి వస్తానని, యాక్టర్ అయిపోతానని చెప్పాడు. నేనేం డైరెక్ట్ గా ఎంకరేజ్ చేయలేదు. కాకపోతే పరిచయమున్న ప్రొడ్యూసర్స్ ని కలవమని చెప్పాను. వెళ్లి కలిశాడు.. కానీ, బాగా ఆలోచించి ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ కవర్ సాంగ్ చేశాడు.
ఆ కవర్ సాంగ్ కోసమే దాదాపు 10 లక్షలు ఖర్చు అయ్యింది. అయినా నీకింకా వయసు రాలేదురా.. ఓ 25 ఏళ్ళు వచ్చేవరకు వెయిట్ చెయ్.. ఓ మ్యాన్లీ లుక్ వస్తుందని చెప్పాను. కానీ వాడేమి వినకుండా సాంగ్ చేశాడు. ఆ సాంగ్ చూసే ఇప్పుడు రెండు సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్ ఆల్రెడీ పుర్తయింది. ఇంకో రెండు సినిమాలు షూటింగ్స్ చేయాల్సి ఉంది” అని చెప్పాడు ప్రభాకర్. ఆ తర్వాత కొడుకు చంద్రహాస్ పై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ.. “నా మీద నెపోటిజం కామెంట్స్ ఏమి రాలేదు. మావాడి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా! మొన్న వాడిని ఇంట్రడ్యూస్ చేసినందుకే పిచ్చ ట్రోల్ చేసేశారు.
వీడు హీరో ఏంటి.. ఆ స్టైల్, యాటిట్యూడ్ ఏంటి.. జేబులో చేతులేంటి అంటూ ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. కానీ.. వైరల్ గా వెళ్ళిపోతున్నాడు. చంద్రహాస్ అంటే ఎవరు అనేది జనాలకు తెలుస్తోంది.. ఎలాగైతే ఏంటి మావాడు జనాలకు తెలిశాడు. జనాలు తిడుతున్నారా? పొగుడుతున్నారా అనే విషయం పక్కన పెడితే.. చంద్రహాస్ అంటే జనాలకు తెలియాలని అనుకున్నాం. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.. కానీ, రేపు వాడి యాక్టింగ్ నచ్చితే వాళ్లే మెచ్చుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం వాడు నిలబడిన స్టైల్ వాళ్లకు నచ్చలేదు.. అదే చెప్పారు. రేపు యాక్టింగ్ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. సో వాళ్ళదేం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. మరి రేపు చంద్రహాస్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.