ప్రేమలో ఉన్నవారికి ప్రతిరోజు ప్రేమికుల రోజే అంటుంటారు. కానీ ఫిబ్రవరి 14 వచ్చిందంటే మాత్రం ఇంకొంచెం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ట్రై చేస్తారు. వాలంటైన్స్ డే రోజున చాలామంది తమ ప్రేమను తన ప్రియుడికి లేదా ప్రియురాలికి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటారు. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఒక్కటే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో జంటలు ప్రేమలో మునిగి తేలుతున్నాయి. అలాంటి ప్రేమజంటలలో నయనతార, విఘ్నేష్ కూడా ఉంటారు.
ఈ ఏడాది వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ని ఈ జంట గ్రాండ్ గా జరుపుకుంది. వీరి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తనను ఎంతగానో ప్రేమిస్తున్న విఘ్నేష్ కు ప్రేమికుల రోజున సర్పైజ్ ఇచ్చింది. విఘ్నేష్ కు పూల బొకే ఇచ్చి ప్రేమికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. తన ప్రియుడికి బొకేతో పాటు అప్యాయంగా హగ్ కూడా ఇచ్చింది. సరిగ్గా అర్ధరాత్రి 12 సమయంలో ఒకరికొరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ వీడియోను విఘ్నేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం వీరి ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నిజంగా ఇది కచ్చితంగా సంతోషకరమైన ప్రేమికుల దినోత్సవం” అని విఘ్నేష్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ లవ్ బర్డ్స్ కి కామెంట్లలో విష్ చేశారు. త్వరలోనే మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలంటూ మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నయనతార, విఘ్నేష్ వాలంటైన్స్ డే వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.