నయనతార – విఘ్నేశ్ శివన్ ల వివాహం ఇటీవల అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్ట్ లో వీరి వివాహం వైభవంగా జరగగా వీరి పెళ్లికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహానంతరం జూన్ 10న నయనతార దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత ఈ నూతన దంపతులిద్దరూ ఇటీవల హనీమూన్ కు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే పెళ్లి అయింది గనుక నయన్ ఇప్పట్లో సినిమాల్లో నటించే ఛాన్స్ ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara: భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. ఫొటోస్ వైరల్!
కానీ అలా కాకుండా ఈ కొత్త పెళ్లి కూతురు అప్పుడే షూటింగ్ లో అడుగు పెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘జవాన్’ సినిమా రాబోతోంది. ఇందులో నయనతార నటించేందుకు ఒప్పుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే అందరినీ షాక్ కు గురి చేస్తూ ఈ కొత్త పెళ్లి కూతురు నయనతార సోమవారం జవాన్ మూవీలో పాల్గొంది. ఇక ఈ సినిమాతో పాటు నయన్ గాఢ్ ఫాదర్ అనే సినిమాలో కూడా నటించనుంది. మలయాళంలో హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేస్తున్నారు.
Shah Rukh Khan on shooting for Jawan: Atlee and I have a good chemistry; Nayanthara begins shoot of movie with SRK in Mumbai after returning from her honeymoon https://t.co/8VeITTShKF @iamsrk #SRK #Jawan #Nayanathara
— KRKBOXOFFICE (@KRKBoxOffice) June 27, 2022