సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో సినిమాలో అశ్లీల సీన్లు బాగా పెరిగిపోతున్నాయి. బోల్డ్‌నెస్ పేరిట ఫిల్మ్ మేకర్స్ బూతులను తెరపైకి తెస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా అశ్లీలతను ఎక్కువగా చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీనియర్ నటులు కూడా బూతు సీన్లలో భాగం అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా వారిపై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ బోల్డ్ సీన్‌లో నటించి ట్రోలింగ్స్‌కు గురవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘టీకు వెడ్స్ షేరు’ సినిమా కు సంబంధించిన ట్రైలర్ కొద్దిరోజుల క్రితం విడుదలైంది.
ఆ ట్రైలర్‌లో హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ.. హీరోయిన్ అవ్‌నీత్ కౌర్‌ల మధ్య ముద్దు సీను ఉంటుంది. ఆ సీన్‌లో ఇద్దరూ హద్దులు దాటినట్లు ఉండటంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ముఖ్యంగా ముద్దు సీనుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 21 ఏళ్ల నటితో 49 ఏళ్ల నీకు ముద్దు సీన్లు ఏంటంటూ మండిపడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ బాధ్యతతో నడుచుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇక, ఈ వివాదంపై నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘‘ ఆ ముద్దు సీనులో తప్పేముందు. రొమాన్స్‌కు వయసుతో పని లేదు. కానీ, సమస్య ఏంటంటే.. యువకులకు ఇలాంటి అవకాశాలు రావటం లేదు. వయసుతో సంబంధం లేకుండా షారుఖ్ ఖాన్ రొమాన్స్ సీన్లలో నటిస్తున్నారు. ఈ కాలంలో ప్రేమించటం.. బ్రేకప్ చెప్పుకోవటం అంతా వాట్సాప్‌లోనే జరిగిపోతోంది. రొమాన్స్‌లో బతికే వాళ్లు మాత్రమే రొమాన్స్ చేయగలరు’’ అని అన్నారు. మరి, వయసులో తనకంటే 20 ఏళ్లు చిన్నదైన నటితో నవాజుద్దీన్ సిద్ధిఖీ హద్దులు దాటి ముద్ద సీన్‌లో నటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.